Telugu News » Bhatti Vikramarka: ‘బంద్ పేరుతో తప్పించుకుంటున్నారా..?’ భట్టి సంచలన వ్యాఖ్యలు!

Bhatti Vikramarka: ‘బంద్ పేరుతో తప్పించుకుంటున్నారా..?’ భట్టి సంచలన వ్యాఖ్యలు!

పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్సలు ఉన్నాయా? అని భట్టి ప్రశ్నించారు.

by Mano
Bhatti Vikramarka: 'Are you escaping in the name of Bandh?' Bhatti's sensational comments!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS mla) అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy)పై జరిగిన దాడికి నిరసనగా ప్రభుత్వం బంద్ ‌ప్రకటించడాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తప్పుబట్టారు. పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్సలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు.

Bhatti Vikramarka: 'Are you escaping in the name of Bandh?' Bhatti's sensational comments!

మీడియాతో భట్టి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనల్లో ఎంపీకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్న ప్రభుత్వం దాడి ఎందుకు చేశాడని విచారణ చేసి నిజా నిజాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి విపక్షాలపై దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

దర్యాప్తు సంస్థలు, పోలీసులను మీ దగ్గర పెట్టుకుని దాడికి నిరసనగా బంద్ కాల్ ఇస్తామని ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందని భట్టి అన్నారు. బంద్ కాల్ పిలుపు ఎవరిపైన ఇస్తున్నారు? బంద్ దేని కోసం? మీ పాలనపైన మీరే ఇచ్చుకుంటారా? బంద్ పేరుతో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా? అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ చేసి నిజా నిజాలను బయట పెట్టండి.. అటూ భట్టి పట్టుబట్టారు. ‘కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దాడులను ప్రోత్సహించదు.. కాంగ్రెస్ అంటేనే అహింస పార్టీ ఇలాంటి దాడులను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది..’ అని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.

You may also like

Leave a Comment