Telugu News » Israel Ground Operation: ఒప్పందం ఉల్లంఘన.. గాజాపై గ్రౌండ్‌ ఆపరేషన్ షురూ..!

Israel Ground Operation: ఒప్పందం ఉల్లంఘన.. గాజాపై గ్రౌండ్‌ ఆపరేషన్ షురూ..!

ఇజ్రాయెల్ ఆర్మీ(Israel Army) గాజాపై గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇవాళ ఉదయంతో ముగిసినా సంధి సమయంలో మిలిటెంట్లు కాల్పులు జరిపారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

by Mano
Israel Ground Operation: Violation of agreement.. Ground operation on Gaza started..!

ఇజ్రాయెల్ ఆర్మీ(Israel Army) గాజాపై గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇవాళ ఉదయంతో ముగిసినా సంధి సమయంలో మిలిటెంట్లు కాల్పులు జరిపారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. జెరూసలెం(Jerusalem)లో గురువారం ఉదయం ఉగ్రదాడి జరిగింది. ఇద్దరు పాలస్తీనా సాయుధులు బస్టాండ్‌లో ఉన్న వారిపై కాల్పులు జరపటం వల్ల ముగ్గురు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.

Israel Ground Operation: Violation of agreement.. Ground operation on Gaza started..!

ఇజ్రాయెల్ ఉదయం 7గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసిన అరగంట తర్వాత దాడులు ప్రారంభించినట్లు ప్రకటించింది. గాజా స్ట్రిప్‌లోని హమాస్ స్థావరాలపై యుద్ధ విమానాలతో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. దీంతో హమాస్‌ స్థావరాలపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలతో దాడులు ప్రారంభించింది. ఒప్పందం గడువు ముగియడంతో శుక్రవారం ఉదయం గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.

గత నెల 24న ఇరువర్గాల మధ్య కుదిరిన వారం రోజుల కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా హమాస్ వంద మందికిపైగా బందీలను వదిలిట్టింది. ఇజ్రాయెల్ 240 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మెరుపుదాడిలో 1200 మంది పౌరులు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికి గాజా పట్టీలో వైమానిక, భూతల దాడుల్లో 15వేల మంది మృతిచెందారు.

మరోవైపు.. కాల్పుల విరమణ చివరి రోజు తమ వద్ద ఉన్నబందీల్లో మరో 8 మందిని హమాస్ వదిలిపెట్టగా అందుకు బదులుగా ఇజ్రాయెల్ 30 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. తెల్లవారుజామున గాజాస్ట్రిప్‌ చేరుకున్న పాలస్తీనా ఖైదీలకు.. స్థానికులు, వారి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. హమాస్ జెండాలను పట్టుకొని నినాదాలు చేశారు.

You may also like

Leave a Comment