Telugu News » BJP : హైటెన్షన్ లో బీజేపీ.. ఆ మూడు రాష్ట్రాల సీఎంలు ఎవరు.. ?

BJP : హైటెన్షన్ లో బీజేపీ.. ఆ మూడు రాష్ట్రాల సీఎంలు ఎవరు.. ?

రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విజయాన్ని అందుకున్న బీజేపీపై అందరి దృష్టి పడింది. ఈ మూడు రాష్ట్రాల సీఎం అభ్యర్థులపై ఆసక్తి నెలకొంది. ఈ స్థానాల్లో సీఎం పదవిని సీనియర్లకు కట్టబెడతారా..? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా.. అనేది పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.

by Venu

ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections)..మూడు రాష్ట్రాలలో బీజేపీ, కాషాయం జెండా ఎగరేసింది. తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్, మిజోరంలో జెడ్పీఎం గెలుపొందగా.. తెలంగాణలో కాంగ్రెస్ అధిష్టానం సీఎం గా రేవంత్ రెడ్డిని కన్ఫాం చేసింది. ఇదే సమయంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విజయాన్ని అందుకున్న బీజేపీపై అందరి దృష్టి పడింది. ఈ మూడు రాష్ట్రాల సీఎం అభ్యర్థులపై ఆసక్తి నెలకొంది. ఈ స్థానాల్లో సీఎం పదవిని సీనియర్లకు కట్టబెడతారా..? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా.. అనేది పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.

bjp

మరోవైపు కొత్త ఎమ్మెల్యేల అభిప్రాయాలే ఆయా రాష్ట్రాల్లోని సీఎంల ఎంపికకు కీలకం కానున్నట్టు తెలుస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్ రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన తర్వాత కొత్త సీఎంలను కన్ఫాం చేయాలని పార్టీ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అంతేగాక 2024 లో ఉన్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు చర్చ జరుగుతుంది.

కాగా వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎలాంటి అడ్డంకులు కలిగించని నాయకులనే మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా నియమించాలని అధిష్టానం భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. మరోవైపు మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సీఎం రేసులో.. ప్రహ్లాద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర తోమర్​లతో పాటు కైలాశ్​ విజయ వర్గీయ పేరు కూడా వినిపిస్తోంది.

రాజస్థాన్​ (Rajasthan)లో సీఎం క్యాండిడేట్​గా మాజీ సీఎం వసుంధర రాజే పేరు బలంగా వినిపిస్తున్నా.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, బీజేపీ నేతలు దియాకుమారి, మహంత్ బాలక్ నాథ్​ల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నా యి.

చత్తీస్ గఢ్ (Chhattisgarh)లో మాజీ సీఎం రమణసింగ్ సీఎం రేసులో ఉన్న మొదటి వ్యక్తికాగా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ సావో, ధర్మలాల్ కౌశిక్, మాజీ ఐపీఎస్ ఓపీ చౌదరి కూడా సీఎం రేసులో ఉన్నారు. ఇదే సమయంలో కొత్త సీఎంలుగా బీజేపీ ఎవరిని ఎంపిక చేయనుందనేది రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

You may also like

Leave a Comment