Telugu News » H-1B Visa: హెచ్‌-1బీ వీసాల్లో మోసాలకు చెక్.. ఎంపిక ప్రక్రియలో కొత్త నిబంధనలు..!!

H-1B Visa: హెచ్‌-1బీ వీసాల్లో మోసాలకు చెక్.. ఎంపిక ప్రక్రియలో కొత్త నిబంధనలు..!!

2025 ఆర్థిక సంవత్సరానికి జారీచేసే హెచ్‌-1బీ వీసాల(H-1B Visa) లాటరీ ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు అమెరికా కొత్త నిబంధనలు ప్రకటించింది. 2025 సంవత్సరానికి జారీ చేసే వీసాల ప్రక్రియకు ఈ కొత్త నిబంధన అమలు కానుంది.  

by Mano
H-1B Visa: Check for Frauds in H-1B Visas.. New Rules in Selection Process..!!

వీసాల రిజిస్ట్రేషన్‌(Registration of visas) ప్రక్రియలో మోసాలను అరికట్టేందుకు అగ్ర రాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. 2025 ఆర్థిక సంవత్సరానికి జారీచేసే హెచ్‌-1బీ వీసాల(H-1B Visa) లాటరీ ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు కొత్త నిబంధనలు ప్రకటించింది. 2025 సంవత్సరానికి జారీ చేసే వీసాల ప్రక్రియకు ఈ కొత్త నిబంధన అమలు కానుంది.

H-1B Visa: Check for Frauds in H-1B Visas.. New Rules in Selection Process..!!

దీంతో ఇకపై వీసా కోసం ఎవరు ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా ఒకే దరఖాస్తుగా పరిగణించనున్నారు. గతేడాది ఈ వీసాల కోసం ఏకంగా 7.80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఒకే వ్యక్తి తరఫున అనేక దరఖాస్తులు సమర్పించి లాటరీ విధానంలో ప్రయోజనం పొందేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనను ప్రవేశపెట్టారు.

పిటిషన్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ‘కేంద్రీకృత ఎంపిక ప్రక్రియ’ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి దరఖాస్తుదారుడు సరైన పాస్‌పోర్టు వివరాలు, ప్రయాణ పత్రాలను విధిగా సమర్పించాల్సి ఉంటుంది.

తప్పుడు సమాచారం ఉన్న దరఖాస్తులను తిరస్కరించే అధికారం యూఎస్‌సీఐఎస్‌కి ఉంటుంది. వీసాల తొలి రిజిస్ట్రేషన్‌ 2025 మార్చి 6 నుంచి 22 వరకు కొనసాగుతుందని యూఎస్‌సీఐఎస్ తెలిపింది. ఫిబ్రవరి 28 నుంచి కంపెనీలు తమ అకౌంట్లను తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఫామ్ ఐ-129, నాన్-క్యాప్ హెచ్ 1బి పిటిషన్ల కోసం ఫామ్ ఐ-907 పత్రాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

You may also like

Leave a Comment