నిరుద్యోగులకు తెలంగాణ (Telangana) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఏడువేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.
తెలంగాణ పునర్ నిర్మాణ సభ పేరుతో ఇంద్రవెల్లిలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ….. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించారు. త్వరలోనే పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. మరో 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఈ సందర్బంగా చెప్పారు. అంతకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.
త్వరలోనే రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కరెంట్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని, త్వరలోనే గృహజ్యోతి పథకం కింద.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను కూడా అమలు చేస్తామన్నారు.