Telugu News » CM Revanth Reddy: కేంద్రంతో ఘర్షణ రాష్ట్రాభివృద్ధికి ఆటంకం: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: కేంద్రంతో ఘర్షణ రాష్ట్రాభివృద్ధికి ఆటంకం: సీఎం రేవంత్‌రెడ్డి

ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

by Mano
CM Revanth Reddy: Clash with the Center is a hindrance to the state's development: CM Revanth Reddy

కేంద్రంతో ఘర్షణ వైఖరి రాష్ట్రాభివృద్ధికి ఆటంకమని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అభిప్రాయపడ్డారు. ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

CM Revanth Reddy: Clash with the Center is a hindrance to the state's development: CM Revanth Reddy

విభజన చట్టం ప్రకారం 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని తెలిపారు. ఎన్‌టీపీసీకి కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు ఇస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతంలో వెలుగులు నిండనున్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు.

స్కై వేల ఏర్పాటు, టెక్స్ టైల్స్ ఏర్పాటు విషయంలో ప్రధాని సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారి పట్ల తమ ప్రభుత్వం గౌరవప్రదంగా వ్యవహరిస్తుందన్నారు. హైదరాబాద్ మెట్రో, మూసీ నదీ పరివాహక అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని కోరారు. అదేవిధంగా సెమీ కండక్టర్ ఇండస్ర్టీ ఏర్పాటుకు సహకరించాలని విన్నవించారు.

రాజకీయాలు ఎన్నికల సమయంలోనేనని, అభివృద్ధి విషయంలో కాదని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహృద్భావ వాతావరణం ఉండాలని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంతో తమ ప్రభుత్వం వైరుధ్యం పెట్టుకోదని, కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. అందుకే రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి భేషజాలు లేకుండా ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసాశామని చెప్పారు.

You may also like

Leave a Comment