Telugu News » Tirumala : తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం….!

Tirumala : తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం….!

తిరుమల (Tirumala) లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Brahmotsavalu) అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.

by Ramu
srivari salakatla brahmotsavam 2023 starts in tirumala

తిరుమల (Tirumala) లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Brahmotsavalu) అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ రోజు సాయంత్రం 6.15 గంటలకు బ్రహోత్సవాలు మొదలయ్యాయి. మలయప్పస్వామి(Malayappa Swamy) వారి సమక్షంలో మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు.

srivari salakatla brahmotsavam 2023 starts in tirumala

గరుడ ధ్వజాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. శ్రీ వారి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్ తిరుమలకు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన పెద్ద శేష వాహన సేవలో పాల్గొననున్నారు. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఎం రాక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల తాకిడి అధికంగా వుంది. భక్తులు తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపులను గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ప్రజలు, భక్తులకు పోలీసులు సూచించారు. మరోవైపు భక్తుల రద్దీ నేపథ్యంలో సిఫారసు లేఖపై బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

మరోవైపు తిరుపతిలో సీఎం జగన్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తిరుపతిలో రూ. 650 కోట్ల వ్యయంతో నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం శ్రీనివాస సేతును తిరుపతి ప్రజలకు ఆయన అంకిత మిచ్చారు. 3518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలను ఆయన అందజేశారు.

You may also like

Leave a Comment