Telugu News » Aravind : ఏం మాట్లాడారో తెలుసుకోండి!

Aravind : ఏం మాట్లాడారో తెలుసుకోండి!

తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ ది కాదా? అని ప్రశ్నించారు అరవింద్. ఒకనాడు తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి ఎందుకు వెనక్కి తీసుకుందని ధ్వజమెత్తారు.

by admin
mp-aravind

బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మాటలను నమ్మితే నట్టేట మునగడమేనని అన్నారు బీజేపీ ఎంపీ అరవింద్ (MP Aravind). ప్రధాని మోడీ (PM Modi) పార్లమెంట్ ప్రసంగంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మోడీ మాటలను వక్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. గతంలో బీజేపీ హయాంలో జరిగిన రాష్ట్ర విభజనను వివరించిన ప్రధాని.. ఉమ్మడి ఏపీ విభజన సమయంలో సరైన చర్యలు తీసుకోలేదని మాత్రమే చెప్పారని అన్నారు. దానికే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ గగ్గోలు పెడుతున్నాయని మండిపడ్డారు.

mp-aravind

తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ ది కాదా? అని ప్రశ్నించారు అరవింద్. ఒకనాడు తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి ఎందుకు వెనక్కి తీసుకుందని ధ్వజమెత్తారు. ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాణ త్యాగాలకు ముమ్మాటికీ కారణం సోనియాగాంధీ అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు చరిత్రలో హీనులుగానే మిగిలిపోతారన్నారు.

ఇక కేటీఆర్ (KTR) వ్యాఖ్యలపై స్పందించిన అరవింద్.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యువత గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని, కల్వకుంట్ల కుటుంబం వారి కోసం తొమ్మిదేళ్ల కాలంలో ఏం చేసిందని అడిగారు. తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల కుటుంబం చరిత్ర మొత్తం తెలుసునని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత తన తండ్రిపైనే ఇప్పటి వరకు ఒత్తిడి చేయలేదని, అలాంటిది కేంద్రంపై చేశామనడం హాస్యాస్సదమన్నారు. కేసీఆర్ కేబినెట్‌ లో, శాసనసభ్యులకు ఇచ్చిన టికెట్లలో ఎంతమంది మహిళలకు అవకాశం ఇచ్చారని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

తొమ్మిదిన్నర ఏళ్ల తెలంగాణను లూటీ చేశారని.. యూనివర్సిటీలను నాశనం చేశారని ఆరోపించారు అరవింద్. చేసిన వాగ్దానాలను ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. కవిత ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని, రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ఏం చేశారని అడిగారు. కేటీఆర్, కవిత వేల కోట్లు సంపాదించారని, వీరిద్దరు స్కాములతో తెలంగాణను లూటీ అయిందని విమర్శించారు. రాష్ట్రంలో సారా ఏరులై పారుతోందని మండిపడ్డారు అరవింద్.

You may also like

Leave a Comment