హైద్రాబాద్లో గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. గచ్చి బౌలి స్టేడియం వద్ద మొత్తం 25 గ్రీన్ మెట్రో బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ….. టీఎస్ ఆర్టీసీ మొత్తం 550 గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులను తీసుకురాబోతుందని వెల్లడించారు. నగరంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అనేక చర్యలను చేపట్టబోతున్నట్టు వెల్లడించారు.
అన్ని ఆర్టీసీ బస్సులను మెట్రోకు అనుసంధానం చేయాలన్నారు. అన్నింటినీ ఏసీ బస్సులుగా మారిస్తే మంచిదన్నారు. 35 సీట్లే వున్నప్పటికీ ఏసీ బస్సు కాబట్టి ప్రయాణికులు నిలబడి కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఆర్టీఎసీలో ఎండీ సజ్జనార్ ఒక నూతన ఒరవడిని తీసుకు వచ్చాురని చెప్పారు.
కేంద్ర విధానాల వల్ల ఎలక్ట్రిక్ బస్సులను పెంచుకోలేక పోతున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ బస్ లను పంచుకుంటామన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలకు సబ్సిడీ కూడా ఇచ్చామని వెల్లడించారు. ప్రజలు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం రాకముందు కేవలం 71 లక్షల వాహనాలు మాత్రమే ఉండేవన్నారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగిందన్నారు. ఇప్పుుడు సుమారు 1.52 కోట్ల వాహనాలకు సంఖ్య పెరిగిందన్నారు. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయడం, గెజిట్ కూడా రావడంతో ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులుగా మారిపోయారని చెప్పారు. తాను మంత్రిగా ఇంత గొప్ప బిల్లును ప్రవేశ పెట్టడం తనకు ఆనందాన్ని కలిగించిందన్నారు.