Telugu News » Spouse Transfers : స్పౌస్ ఉపాధ్యాయుల ఆందోళన…. విద్యా శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం….. !

Spouse Transfers : స్పౌస్ ఉపాధ్యాయుల ఆందోళన…. విద్యా శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం….. !

లక్డీకాపూల్​లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఈ రోజు మౌన దీక్ష నిర్వహించాలని ఉపాధ్యాయులు నిర్ణయించారు.

by Ramu
teachers fight for spouse transfers spouse teachers against on go

స్పౌజ్ (Spouse) బదిలీల (Transfers) విషయంలో ఉపాధ్యాయులు (Teachers) పలు చోట్ల ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు ప్రయత్నించాయి. దీంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. లక్డీకాపూల్​లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఈ రోజు మౌన దీక్ష నిర్వహించాలని ఉపాధ్యాయులు నిర్ణయించారు.

teachers fight for spouse transfers spouse teachers against on go

మౌన దీక్ష కోసం హాజరయ్యేందుకు విద్యాశాఖ కమిషనర్ నివాసం వద్దకు భారీగా ఉపాధ్యాయులు చేరుకున్నారు. ఉపాధ్యాయ దంపతులు, తమ పిల్లలతో కలిసి కమిషనర్ కార్యాలయం ఎదుట భైఠాయించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయుల పిల్లలు గాంధీ వేషధారణలో అక్కడకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కు భారీగా అంతరాయం కలిగింది.

దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఆ సమయంలో చిన్నారుల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

జీవో నెం 317 ద్వారా తమకు ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసిందని ఉపాధ్యాయ దంపతులు ఆరోపించారు. తాము వేరు వేరు చోట్ల విధులు నిర్వహించడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. ఆ బాధలతో తమ పిల్లలను కూడా సరిగా చూసుకోలేకపోతున్నామని వాపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

You may also like

Leave a Comment