Telugu News » Udham Singh : ఊచ కోతపై ఉక్కు పిడికిలి.. ఉధం సింగ్..!

Udham Singh : ఊచ కోతపై ఉక్కు పిడికిలి.. ఉధం సింగ్..!

రక్తానికి రక్తంతో నే సమాధానం చెప్పి ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగిన ఉద్దండుడు మన ఉధం సింగ్.

by Ramu

భారత స్వాతంత్ర్య సమరంలో ఒక్కో యోధుడిది ఒక్కో రకమైన చరిత్ర. ఒక్కక్క వీరుడి గురించి చదువుతుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. వెంటనే, మనలో పోరాట స్ఫూర్తి రగులుతుంది. అలా చెప్పుకోదగిన గొప్ప పోరాట యోధుల్లో ఉధం సింగ్ ఒకరు.

జలియన్ వాలా బాగ్ లో రక్త పాతాన్ని చూసి రగిలి పోయి.. రక్తానికి రక్తంతోనే సమాధానం అని ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగిన ఉద్దండుడు మన ఉధం సింగ్. అది.. 1919 ఏప్రిల్ 13. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జలియన్ వాలా బాగ్‌ లో అంతా సమావేశం అయ్యారు. బ్రిటీష్ పాలకుల దురాగతాలకు వ్యతిరేకంగా సభలో అందరూ గొంతెత్తున్నారు. అప్పుడే అకస్మాత్తుగా అక్కడ వున్న వారిపై తూటాల వర్షం కురిసింది. కళ్లు మూసి తెరిచే లోగానే జలియన్ వాలా బాగ్ స్మశానంగా మారింది.

బ్రిటీష్ అధికారి జనరల్ డయ్యర్ కిరాతకాలకు ఈ ఘటన ఓ సాక్ష్యంగా నిలిచి పోయింది. ఆ తర్వాత కాలం గడిచి పోయింది. దేశం ఆ గాయాన్ని మరిచి పోయింది. కానీ, ఓ పసి హృదయం మాత్రం ఈ ఘటనతో కసి పెంచుకుంది. కళ్ల ముందు అంత మందిని ఊచకోత కోయడం చూసి ఉద్రేకంతో ఊగి పోయింది. రక్తానికి రక్తంతో బదులివ్వాలని సంకల్పించింది. ఆకలితో ఉన్న పెద్ద పులిలా అవకాశం కోసం ఎదురు చూశాడు.

ఆ పసివాడే ఉధం సింగ్. సరిగ్గా 21 ఏండ్ల తర్వాత అదును చూసి డయ్యర్ పై దాడికి రెడీ అయ్యాడు. 1940 మార్చి 13న లండన్ లోని కాక్స్ టన్ హాల్‌ లో అందరూ చూస్తుండగానే డయ్యర్ పై కాల్పులు జరిపాడు. క్షణాల్లోనే డయ్యర్ నెలకొరిగాడు. ఆ హత్య చేసింది తానేనని సగర్వంగా కోర్టులో తలెత్తుకుని నిలబడ్డాడు ఉధం సింగ్. తన దేశం కోసం మరణించడం తనకు చాలా సంతోషమని చెప్పి చిరునవ్వులు చిందించాడు.

 

You may also like

Leave a Comment