హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) కి చెందిన యాడ్ పై వివాదం మొదలైంది. ఆ బ్యాంకుకు చెందిన ‘విజిల్ ఆంటీ’(Vigil Aunty)యాడ్ పై దుమారం రేగుతోంది. ఆ యాడ్ హిందువుల సెంటిమెంట్లకు వ్యతిరేక ఉందని హిందువులు ఫైర్ అవుతున్నారు. ఆ యాడ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉపసంహరించుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా సురక్షితమైన బ్యాంకింగ్ విధానాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా 2022లో హెచ్‌డీఎఫ్‌సీ ఓ క్యాంపెయిన్ ను తీసుకు వచ్చింది. అందులో భాగంగా ‘విజిల్ అంటీ’పేరిట ఓ యాడ్ ను రూపొందించారు. ప్రజల్లో సైబర్ మోసాల గురించి అవగాహన కల్పించి వారిని జాగ్రత్త పరిచేలా ఈ యాడ్ ను రూపొందించారు.
ఈ యాడ్‌లో నటి అనురాధ మీనన్ నటించారు. ఈ యాడ్‌లో విజిల్ ఆంటీ నుదుటిపై ఓ బిందీ (బొట్టు బిళ్ల) ఉంటుంది. ఆ బిందీ ‘స్టాప్’ సింబల్ ఉంది. దీంతో ఈ యాడ్ పై హిందూ సంఘాలు మండి పడుతున్నాయి. బిందీని (బొట్టును) హిందూ మహిళలు అత్యంత పవిత్రంగా భావిస్తారని హిందూ సంఘాలు చెబుతున్నాయి.
అలాంటి పవిత్రమైన బింది స్థానంలో స్టాప్ సింబల్ పెట్టడం ఏంటని మండిపడుతున్నాయి. బాంక్ అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ యాడ్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన హిందూ ఖాతాదారులందరూ ఈ విషయాన్ని ఆయా బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి నిరసన తెలపాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.