Telugu News » 72 ఏండ్లుగా పాక్-ఆప్ఘనిస్తాన్ సరిహద్దులో దసరా పండుగ… !

72 ఏండ్లుగా పాక్-ఆప్ఘనిస్తాన్ సరిహద్దులో దసరా పండుగ… !

ఇందులో పఠాన్ తెగకు చెందిన యోగరాజ్ కుటుంబం ప్రధాన పాత్ర పోషిస్తోంది.

by Ramu

హిందువులు (Hindus) ఎక్కడ ఉన్నా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఉంటారు. తమ పండుగలు, తమ సంస్కృతిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తూనే ఉంటారు. ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్ (Pakisthan), ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని నాగపూర్ కడ్బీ ప్రాంతంలో ఇప్పటికీ హిందూ సాంప్రదాయలు సజీవంగా ఉండటం దీనికి చక్కని ఉదాహరణ.

ముఖ్యంగా అక్కడ హిందువుల పండుగ దసరాను ఘనంగా నిర్వహిస్తున్నారు. రావణ దహనం లాంటి కార్యక్రమాలతో భారత్ ను తలపించేలా అక్కడ ఉత్సవాలు చేస్తున్నారు. దేశ విభజనతో భారత్ కు దూరమైనప్పటికీ మన హిందూ సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఇందులో పఠాన్ తెగకు చెందిన యోగరాజ్ కుటుంబం ప్రధాన పాత్ర పోషిస్తోంది.

దేశ విభజన తర్వాత 1947లో యోగరాజ్ పూర్వీకులు మొదట హరిద్వార్ కు వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి ఫరీదాబాద్ కు చేరుకున్నారు. ఆ తర్వాత చివరకు పాక్- ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని నాగపూర్ ప్రాంతంలో సెటిల్ అయ్యారు. భారత్ లో ఉన్న సమయంలో యోగరాజ్ కుటుంబ సభ్యులు సనాతన్ ధర్మ యువక్ సంస్థను ఏర్పాటు చేశారు.

నాగపూర్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న తర్వాత అక్కడ కూడా యోగరాజ్ నేతృత్వంలో సనాతన్ ధర్మ యువక్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ 200 కుటుంబాలు నాగపూర్ ప్రాంతంలో నివసిస్తున్నాయి. మొదట్లో కాస్త ఘర్షణలు జరిగినప్పటికీ ఆ తర్వాత పరిస్థితులు సద్దుమనిగాయని అక్కడి హిందువులు చెబుతున్నారు.

ఆ ప్రాంతంలో తాము మైనార్టీలుగా ఉన్నామని చెబుతున్నారు. అక్కడి ముస్లింలతో కలిసి మెలిసి జీవిస్తున్నామని చెబుతున్నారు. తాము ఉన్న కోహట్ ప్రాంతంలో మసీదుకు, ఆలయానికి కలిపి ఉమ్మడి గోడ ఉంటుందని అన్నారు. కానీ అవి ఎప్పుడూ తమ మధ్య మతఘర్షణలకు దారి తీయలేదన్నారు.

 

You may also like

Leave a Comment