వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడ్డాడు. దీంతో హార్దిక్ మైదానం నుంచి వెళ్లిపోయాడు.
బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా 9వ ఓవర్‌ను బౌలింగ్ చేసేందుకు వచ్చిన పాండ్య తొలి బంతిని డాట్ బాల్‌గా వేయగా.. తర్వాత రెండు బాల్స్‌కు బౌండరీలు సమర్పించుకున్నాడు. అయితే మూడో బాల్‌ను బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ కొట్టిన స్ట్రయిట్ డ్రైవ్‌ను ఆపే ప్రయత్నంలో హార్దిక్ గాయపడ్డాడు.
కాలు బెనకడంతో టీమిండియా ఫిజియో వచ్చి పరీక్షించాడు. కొంతసేపు తర్వాత బౌలింగ్‌కు సిద్ధమైన పాండ్య ఇబ్బందిపడ్డాడు. దీంతో అతడు మైదానం వీడాడు. ఈ ఓవర్‌లో మిగతా మూడు బాల్స్‌ను విరాట్ కోహ్లీ వేశాడు. పాండ్యకు అయిన గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది.
హార్దిక్‌కు పెద్ద గాయం రావొద్దని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. టీమిండియాకు హార్దిక్ పాండ్య చాలా కీలకం కావడమే దీనికి కారణం. అతడు బాల్‌తోనే కాకుండా బ్యాట్‌తో కూడా రాణించగలడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు బౌలింగ్‌లో ప్రభావం చూపిన పాండ్యకు ఇంకా బ్యాటింగ్ చేసే అవకాశం సరిగ్గా రాలేదు.