ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ(LokSabha), రాష్ట్ర అసెంబ్లీ(Assembly)కి ఎన్నికలు జరగడానికి సరిగ్గా ఇంకా నెల రోజుల సమయం ఉంది. మే 13న ఏపీలో ఎన్నికలు ఉంటాయని కేంద్రం ఎన్నికల సంఘం(Central Election Commission) ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి.
రెండోసారి తనను ఆశీర్వదించాలని సీఎం జగన్(CM JAGAN) ప్రజలను కోరుతుండగా..జాబ్ కావాలంటే బాబు రావాలి.. రాష్ట్రం బాగుండాలంటే, అభివృద్ధి జరగాలంటే సైకో పాలన పోవాలని పేరిట చంద్రబాబు కొత్త పంథాలో ప్రచారం మొదలెట్టారు. అయితే, ఈసారి ఏపీ ఎన్నికలు విజయం ఇరుపార్టీలకు కత్తిమీద సాము లాంటిదేనని అంటున్నారు విశ్లేషకులు.
తమ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, విద్యారంగంలో తాము చేసిన కృషి తప్పకుండా మరోసారి అధికారంలోకి వచ్చేలా చేస్తాయని అధికార వైసీపీ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తుంటే..వైసీపీకి ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. సరిగ్గా ఎన్నికల టైంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సీఎం జగన్‌కు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
గతంలో అక్రమార్కుల కేసుల విషయంలో అరెస్టు అయ్యి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న జగన్ సీబీఐ(CBI) పిలిచినప్పుడల్లా విచారణకు హాజరై వస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన బెయిల్ పిటీషన్ రద్దు చేయాలని, సీబీఐ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి అప్పగించాలని ఎంపీ రఘరామ వేసిన సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌పై నేడు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఒకవేళ జగన్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లయితే ఎన్నికల వేళ ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తప్పదని విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు.