ఉన్నత చదువులు.. అలారుముద్దుగా ఉన్న పెంపకం.. ఇవేవీ కూడా పిల్లల చావులను ఆపలేకపోతున్నాయంటున్నారు.. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్న అంశంగా మానసిక నిపుణులు పరిగణిస్తున్నారు.. నిత్యం ఎక్కడో ఒక చోట బంగారు భవిష్యత్తు ఉన్న స్టూడెంట్స్, ఏదో ఒక తీరుగా, ఆత్మహత్యలకు (Suicide) పాల్పడుతోన్న వార్తలు, తల్లిదండ్రుల్లో భయాన్ని నింపుతున్నాయని అనుకొంటున్నారు.
తాజాగా హైదరాబాద్ (Hyderabad)లో రైలు కిందపడి ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. నారపల్లి (Narapalli)లో ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోన్న విజయకుమార్ అనే యువకుడు.. శుక్రవారం మధ్యాహ్నం బీబీనగర్ నుంచి సనత్‌నగర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్నాడు. కాగా మృతుడి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా పోలీసులు అతన్ని గుర్తించారు..
మరోవైపు విజయకుమార్ ఘట్‌కేసర్ (Ghatkesar)లో డిప్లొమా చదువుతున్న సమయంలో గంజాయికి బానిసైనట్లు తెలుస్తోంది. తర్వాత వేరే కాలేజీకి మార్పించిన మార్పు రాలేదని మృతుని తండ్రి తెలిపారు. ఈ క్రమంలో ఫస్టియర్ లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో చదువు మానేసి చర్లపల్లిలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడని వెల్లడించారు.. అయితే నగరంలో ఇటీవల గంజాయి రవాణాపై పోలీసులు నిఘా పెంచడంతో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.
ఈ క్రమంలో గంజాయి దొరకకపోవడంతో మానసిక ఒత్తిడికి గురైన విజయ్‌కుమార్ రైలు కిందపడి ప్రాణాలు తీసుకొన్నట్టు తెలుస్తోంది. మాదక ద్రవ్యాలకు అలవాటైన వ్యక్తి మానసిక స్థితి ఆందోళనకరంగా మారుతుందని ఇదివరకే మానసిక నిపుణులు తెలిపిన విషయం తెలిసిందే.. దీనిలో భాగంగానే మానసిక క్షోభకు గురై విజయ్‌కుమార్ ను అతని తల్లిదండ్రులు.. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడిక్షన్ సెంటర్‌లో చేర్పించినట్టు సమాచారం.. ఇంకా కొలుకొని ఆ యువకుడు ఇంతలోనే కఠిన నిర్ణయాన్ని తీసుకొని, కన్నవారు బ్రతికినంత కాలం క్షోభకు గురయ్యేలా తన దారి తాను వెతుక్కొని వెళ్ళాడని తల్లిదండ్రులు విలపిస్తున్నారు..