Telugu News » IPL : పంతం నెగ్గించుకున్న ఏబీ డివిలియర్స్.. ఇక సీఎస్కే జెర్సీ వేసుకోవాల్సిన పనిలేదు!

IPL : పంతం నెగ్గించుకున్న ఏబీ డివిలియర్స్.. ఇక సీఎస్కే జెర్సీ వేసుకోవాల్సిన పనిలేదు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) లీగ్ దశ మ్యాచులు ప్రారంభం అవ్వగా సోమవారం ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది. మే 21న నుంచి ప్లే ఆఫ్స్ (Play Offs) ప్రారంభం కానుండగా.. మే26వ తేదీన టోర్నీ ప్రారంభం అయిన తమిళనాడులోని చెన్నైలో గల‘ చెపాక్’(Chepak) స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ (Final Match) జరగనుంది.

by Sai
AB de Villiers, who has settled the bet, no longer needs to wear the CSK jersey

ఇప్పటికే లీగ్ మ్యాచుల్లో హోరాహోరీ ఫైట్ సాగుతోంది. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతుంటారు. కోట్లలో డబ్బులు చేతులు మారుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, సోమవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ‘పంజాబ్ కింగ్స్ VS రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’ మ్యాచ్ గెలుపు విషయంలో ఇద్దరు మాజీ క్రికెటర్లు మధ్య ఛాలెంజ్ నడిచింది.

అందులో ఒకరు విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్‌గా పేరొందిన ఏబీ డివిలియర్స్(AB De Villiers) ఒకరైతే మరొకరు స్టెరీస్(Steris).. ఏబీడీ గతంలో ఆర్సీబీ జట్టు తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆయన ఆ జట్టుకు సపోర్టు చేస్తుంటారు. ఈ క్రమంలోనే స్టెరీస్‌కు ఆయన ఛాలెంజ్ విసిరారు.ఆర్సీబీ, పంజాబ్ మ్యాచుల్ బెంగళూరు గెలవకపోతే తన ప్రత్యర్థి అయిన చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు జెర్సీని ఇకపై ధరిస్తానని చెప్పారు. అలాగే ఆర్సీబీ గెలిస్తే తాను బెంగళూరు జెర్సీ ధరిస్తానని స్టెరీస్ పందెం వేసుకున్నారు.

నిన్న రాత్రి జరిగిన మ్యాచులో దినేష్ కార్తీక్ తన అద్భుతమైన ఫినిషింగ్‌తో బెంగళూరు జట్టుకు తొలి విజయం అందించాడు. దీంతో ఏబీ డివిలియర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్. ఇకపై తను సీఎస్కే జెర్సీ వేసుకోవాల్సిన అవసరం లేదంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా, ఈ సీజన్‌లో ఆర్సీబీ కప్పు గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

You may also like

Leave a Comment