Telugu News » ACB DG CV Anand: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. సీనియర్ ఐపీఎస్ అధికారినీ వదల్లేదుగా..!

ACB DG CV Anand: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. సీనియర్ ఐపీఎస్ అధికారినీ వదల్లేదుగా..!

సైబర్ నేరగాళ్లు (Cyber criminals) మరింత రెచ్చిపోతున్నారు. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ (ACB DG CV Anand) పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు కేటుగాళ్లు.

by Mano
ACB DG CV Anand: Cybercriminals are on the prowl.. even senior IPS officer is not spared..!

సైబర్ నేరగాళ్లు (Cyber criminals) మరింత రెచ్చిపోతున్నారు. అమాయకులను మోసం చేసి సొమ్ము చేసుకోవడానికి కొత్తకొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇప్పటి వరకు ఫోన్లు చేసి, లింక్‌లు పంపి ఓటీపీ, పాస్‌వర్డ్‌లను తెలుసుకుని మోసాలకు పాల్పడ్డారు. ఇప్పుడు మన ప్రమేయం లేకుండానే ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

ACB DG CV Anand: Cybercriminals are on the prowl.. even senior IPS officer is not spared..!

ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఓ సీనియర్ ఐపీఎస్ అధికారినీ వదల్లేదు. తాజాగా ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ (ACB DG CV Anand) పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు కేటుగాళ్లు.

ఆయన పేరుతో డబ్బులు వసూలు చేయడమే కాకుండా అనుచిత సందేశాలు కూడా పంపుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న పోలీసు అధికారి గురించి ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారు. సీవీ ఆనంద్ పేరుతో ఉన్న అకౌంట్ నిజమని నమ్మిన కొందరు సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపుతున్నారు.

మరికొందరు ఆ అకౌంట్ నుంచి మెసేజ్‌లను చూసి షాక్‌కు అవుతున్నారు. దీన్ని గుర్తించిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు.. కేసు నమోదు చేశారు. ఐపీ అడ్రస్‌ల ద్వారా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి ఫేక్ అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫేక్ అని గుర్తిస్తే వెంటనే రిపోర్ట్ కొట్టాలని సూచిస్తున్నారు.

You may also like

Leave a Comment