559
Heroines who married Directors: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి మధ్య ఎలా ప్రేమ పుడుతుందో చెప్పడం కష్టం..! ప్రేమ కథలు రాస్తూనే కొందరు దర్శకులు లవ్ చేస్తారు.. అదే ప్రేమ కథల్లో నటించి హీరోయిన్లు కూడా తెలియకుండానే ప్రేమ మత్తులో పడుతుంటారు. అలా కొందరు హీరోయిన్లు.. తాము పని చేసిన దర్శకులతోనే ప్రేమలో పడి పెళ్లి వరకు వెళ్లారు. రమ్యకృష్ణ, సుహాసిని నుంచి రాశీ, అమలా పాల్ వరకు అలా చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. వాళ్లెవరో చూద్దాం..
1. రమ్య కృష్ణన్
డైరెక్టర్ కృష్ణవంశీ , రమ్యకృష్ణను ప్రేమించిన ఏడేళ్ళ అనంతరం వివాహం చేసుకున్నాడు. 2003లో వీరి వివాహం జరిగింది.
2. సుహాషిని -మణిరత్నం
సుహాసిని గారు, దర్శకుడు మణిరత్నం గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
3. ఖుష్భూ
నటి ఖుష్భూ సైతం డైరెక్టర్ సి.సుందర్ ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. 2000వ సంవత్సరంలో వీరి పెళ్లి జరిగింది.