అడంగల్ కాపీని పొందాలని అనుకుంటున్నారా..? అడంగల్ కాపీని పొందాలని అనుకుంటే, ఇలా ఫ్రీగా పొందవచ్చు. అడంగల్ కాపీ ని ఆన్లైన్ లో ఇక ఫ్రీ గా ఎలా పొందవచ్చు అనేది చూద్దాం.
దీని కోసం ముందు మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి లేదా http://meebhoomi.ap.gov.in/ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీరు దీనిలో అడంగల్ ఎంచుకోండి. హోమ్ పేజీలో, అడంగల్ మీద క్లిక్ చేయండి. భూ యజమాని కావలసిన ఎంపికను ‘మీ అడంగల్’ లేదా ‘విలేజ్ అడంగల్’ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. రెండింటి లో ఏదో ఒకటి క్లిక్ చెయ్యచ్చు. ఇక ఇది డౌన్‌లోడ్ అవుతుంది.
భూ యజమాని దరఖాస్తులో సర్వే నంబర్, ఖాతా నంబర్ కానీ ఆధార్ నంబర్ ని కానీ ఎంటర్ చేసుకోవాలి.
అలానే, పత్ర సంఖ్యను ఎంచుకోండి. దరఖాస్తుదారుడు జిల్లా పేరు, మండలం మరియు గ్రామ పేరును సెలెక్ట్ చేసేసి, పత్రం సంఖ్యను కూడా ఇచ్చేయాలి.
అలానే మీరు అక్కడ వున్నా కాప్చా కోడ్ ని కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇవి పూర్తి అయ్యాక మీ భూమి AP అదంగల్ వివరాలతో ఉన్న పాప్-అప్ మెసేజ్ ని చూడవచ్చు.
Also read: