ప్రముఖ టీవీ సీరియల్ నటి(TV Serial Actress) అడ్డాల ఐశ్వర్య(Addala Aishwarya) తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని ఆమె భర్త పిన్నింటి శ్యామ్ కుమార్(Shyam Kumar) మీడియా ముందుకొచ్చాడు. పెళ్లయిన తర్వాత ఐశ్వర్య రూ.25లక్షలు కాజేసి విడాకులు ఇవ్వాలని తనను, తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఐశ్వర్య తనపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతోందని, తనకు న్యాయం చేయాలని శ్యామ్ కుమార్ కోరారు. వివరాల్లోకి వెళ్తే.. పలు ఛానల్లో ప్రసారమయ్యే టీవీ సీరియళ్ల నటించిన ఐశ్వర్యతో పిన్నింటి శ్యామ్ కుమార్కు ఓ మ్యాట్రీమోనీ పరిచయం ఏర్పడింది. 2023 సెప్టెంబర్ 6న వీరి వివాహం జరిగింది.
పెళ్లైన నెల రోజుల తర్వాత సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య వివాహేతర సంబంధం బయటపడిందని భర్త పిన్నింటి శ్యామ్ కుమార్ ఆరోపించాడు. హైదరాబాద్కు చెందిన రియల్టర్ కరణం రమేష్ బాబుతో ఐశ్వర్య తప్పటడుగు వేసిందంటూ వాపోయాడు. అంతటితో ఆగకుండా తనపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. ప్రస్తుతం ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ మారింది. ఐశ్వర్య జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ, జెమినీ టీవీ.. పలు ఛానల్లో ప్రసారమయ్యే టీవీ సీరియల్లలో అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది సీరియళ్లలో నటిస్తోంది. పలు సినిమాల్లో కూడా ఐశ్వర్య నటించింది.