ప్రభుత్వ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. అయినా ఇంకా సంపాదించాలనే ఆశ.. దీంతో బుద్ధి అడ్డదారి పట్టింది. మనస్సుఆన్లైన్ బెట్టింగుల వైపు మళ్ళింది. ఆశను అదుపు చేసుకోలేక పోయిన అతను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే ఆన్ బెట్టింగ్ ల్లో డబ్బులు పెట్టడం మొదలు పెట్టాడు.. అలా అలా ఆన్ లైన్ బెట్టింగులకు బానిస అయ్యాడు. ఫలితంగా అతనికి వచ్చే జీతం ఏమాత్రం సరిపోవడం లేదు. చివరకు అప్పులు చేయడం మొదలుపెట్టాడు.

మరోవైపు రాహుల్ (Rahul) వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆరు నెలల క్రితం సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఆయనకు సహకరించిన అదే శాఖలో పనిచేస్తున్న అధికారిని కూడా సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా కాంట్రాక్టర్లకు పనులు ఇప్పిస్తానని నమ్మించి దాదాపు 37 మంది నుంచి రూ.15 కోట్లకు పైగా వసూలు చేసినట్లు రాహుల్ పై ఆరోపణలున్నాయి..
ఈ క్రమంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అతని అప్పుల పుట్టను చూసి అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ (Delhi) విమానాశ్రయంలో దుబాయ్ చెక్కేసేందుకు రాహుల్ ప్రయత్నిస్తుండగా.. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడకు వెళ్లి అదుపులో తీసుకొన్నారు.