అప్ఘనిస్తాన్ (Afghanishtan) లోని రాయబార కార్యాలయం ( Embassy) కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి భారత్‌లో దౌత్య కార్యకలాపాలను నిలిపి వేయనున్నట్టు ప్రకటించింది. రాయబార కార్యాలయంలో సిబ్బంది సంఖ్యను, వనరులను భారత్ (India) తగ్గించిందని పేర్కొంది. దీంతో అప్ఘన్ పౌరుల ప్రయోజనాలకు అనుగుణంగా పని చేయడంలో విఫలం అయ్యామని పేర్కొంది.
భారత్ నుంచి సరైన మద్దతు లేక పోవడం వంటి కారణాల వల్త తాము సమర్థవంతంగా విధులు నిర్వహించలేకపోతున్నామని తెలిపింది. భారత్‌లో రాయబార కార్యాలయాన్ని మూసి వేయాలని అనుకుంటున్నట్టు ఇటీవల అప్ఘనిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖకు గత నెల 25న ఓ లేఖను పంపింది. తాజాగా శనివారం కూడా తాలిబన్ ప్రభుత్వం మరో ప్రకటనను విడుదల చేసింది.
భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య ఉన్న చారిత్రక ద్వైపాక్షిక సంబంధాలు, పలు ఒప్పందాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అన్ని రకాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఈ నిర్ణయం పట్ల తాము తీవ్రంగా చింతిస్తున్నట్టు చెప్పింది. దౌత్య అధికారాలు భారత్ కు అప్పగించేంత వరకు సం ఆఫ్ఘన్ పౌరుల కోసం అత్యవసర కాన్సులర్ సేవలు పనిచేస్తాయని వెల్లడించింది.
దౌత్య సంబంధాల విషయంలో జరిగిన వియన్నా కన్వెన్షన్ (1961)లోని ఆర్టికల్ 45 ప్రకారం రాయబార కార్యాలయం ఆస్తులతో పాటు సౌకర్యాలను, సంరక్షక బాధ్యతలను ఆతిథ్య దేశానికి బదిలీ చేస్తారు. ప్రస్తుతం భారత్ లో అప్ఘన్ రాయబారిగా ఫరీద్ మముంద్ జాయ్ వ్యవహరిస్తున్నారు. అప్ఘనిస్తాన్ ను తాలిబాన్లు ఆక్రమించక ముందు అష్రఫ్ ఘనీ ప్రభుత్వం ఆయన్ని నియమించింది.