అఫ్ఘానిస్థాన్ (Afghanistan) తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ(Delhi)లోని తమ రాయబార కార్యాలయాన్ని గురువారం(నవంబర్ 23) నుంచి శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ఆ దేశ రాయబారి ప్రకటించారు. తమకు భారత ప్రభుత్వం నుంచి ఆశించిన రీతిలో సహకారం అందట్లేదని, ఈ క్రమంలోనే తమ రాయబార సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఆగస్టు 2021 ఆగస్టులో అఫ్ఘానిస్థాన్ పరిపాలన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని ఆయన తెలిపారు. రెండేళ్లలో ఆఫ్ఘన్ ప్రజల సంఖ్య గణనీయంగా తగ్గిందని రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.
2021 నుంచి ఆఫ్ఘాన్ శరణార్థులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు దేశం విడిచి వెళ్లడంతో ఈ సంఖ్య సగానికి పడిపోయింది. ఈ కాలంలో చాలా తక్కువ సంఖ్యలో వీసాలు జారీ చేయబడినట్లు తెలిపింది. గత, సెప్టెంబర్ 30వ తేదీన ఆఫ్ఘన్ ఎంబసీ కార్యకలాపాలను నిలిపివేశామని ఆఫ్ఘన్ రాయబారి ఫరీద్ మముంద్‌జాయ్ తెలిపారు.
అయితే న్యూఢిల్లీలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్ఘానిస్థాన్ ఎంబసీ కొనసాగింపునకు భారత ప్రభుత్వ వైఖరి అనుకూలంగా లేనందునే ఎనిమిది వారాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆఫ్ఘన్ అంబాసిడర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దౌత్యవేత్తలకు వీసా పొడిగింపు లేదని ప్రకటించారు.