వాయు కాలుష్యం(Air pollution)తో కొట్టుమిట్టాడుతున్న రాజధాని ఢిల్లీ(Delhi) ఇటీవల వర్షం కురువడంతో కాస్త తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే చాలా వరకు గాలి నాణ్యత పెరగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీపావళికి టపాసులు కాల్చవద్దని సుప్రీంకోర్టు (Supreme court) ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలు సుప్రీం చేసిన ఆదేశాలను బేఖాతరు చేయడంతో కాలుష్యం యథాస్థితికి చేరింది.
టపాసులపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 7న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ రాష్ట్రానికి ఈ నిబంధన ఉందని, తీవ్ర వాయు కాలుష్యంతో పోరాడుతున్న ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)కు మాత్రమే పరిమితం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. వాయు, శబ్ద కాలుష్యాన్ని పరిష్కరించడానికి 2018లో సాంప్రదాయ బాణసంచా కాల్చడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది.
దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో ఏసీఐ గణనీయంగా పడిపోయింది. ఒకవైపు ఢిల్లీలో ఏక్యూఐ 267 వద్దే ఉన్నట్లు సోమవారం ఉదయం గణాంకాలు చెబుతున్నాయి. ఒడిశాలోని తాల్చేర్‌లో ఈ సంఖ్య ‘వెరీ బ్యాడ్’ కేటగిరీకి చేరుకుంది. ఏక్యూఐ 352 ఇక్కడ నమోదైంది. ఆగ్రాలో ఏక్యూఐ ఆదివారం 60గా ఉండగా, సోమవారం నాటికి 149కి పెరిగింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో గరిష్టంగా 149 AQI నమోదైంది. ఇది 21 1కి పెరిగింది.
అదేవిధంగా మహారాష్ట్రలోని లాతూర్ AQI 231 వద్ద ఉంది. ఆదివారం నాటికి ఇక్కడ సంఖ్య 170గా ఉంది. ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఏక్యూఐ 158 నుంచి 277కి పెరిగింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో 91 వద్ద ఉన్న ఏక్యూఐ 205కి చేరుకుంది. కాగా, AQI భిల్వారాలో 91 నుంచి 220కి, చెన్నెలో 177 నుంచి 248కి, ఫరీదాబాద్‌లో 190 నుంచి 274కి, ప్రయాగ్‌లో 168 నుంచి 216కి, రోహ్తక్‌లో 105 నుంచి 262కి పెరిగింది.