Telugu News » Telangana : హాట్ సీట్ గా మెదక్.. తెరపైకి అనేక పేర్లు..!

Telangana : హాట్ సీట్ గా మెదక్.. తెరపైకి అనేక పేర్లు..!

ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు కీలకం కాగా.. ఎక్కువ సీట్లు సాధిస్తేనే క్యాడర్, నేతలు ఇతర పార్టీలకు జంప్ కాకుండా ఉంటారు. ఒకవేళ సత్తా చాటకుంటే జాతీయ పార్టీల ధాటికి తట్టుకోవడం కష్టమే. అందుకే, కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగుతునట్టు తెలుస్తోంది.

by admin
all parties exercise for candidates

– లోక్ సభ ఎన్నికలపై పార్టీల ఫోకస్
– మెదక్ విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
– కేసీఆర్ బరిలో ఉంటారని ప్రచారం
– కాంగ్రెస్ నుంచి సోనియా, విజయశాంతి పేర్లు
– 2004 నుంచి బీఆర్ఎస్ కు కంచుకోటగా మెదక్
– అసెంబ్లీ ఎన్నికల్లో 7 సీట్లలో 6 గెలుపు

తెలంగాణ (Telangana) లో లోక్ సభ ఎన్నికలకు పార్టీలు సమయాత్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ లో సత్తా చాటిన కాంగ్రెస్ (Congress).. అదే స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఈసారన్నా పరువు నిలుపుకోవాలని బీఆర్ఎస్ (BRS) భావిస్తుంటే… పెరిగిన ఓట్ షేర్ ని మరింత పెంచుకోవాలని బీజేపీ (BJP) ప్లాన్ చేస్తోంది. మూడు ప్రధాన పార్టీలు 10 స్థానాల దాకా గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. అయితే.. మెదక్ (Medak) స్థానం విషయంలో ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ పార్టీల నుంచి హేమాహేమీలు బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది.

all parties exercise for candidates

గత 20 ఏండ్లుగా తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అనేలా రాజకీయాలు నడిచాయి. ఉద్యమకారుడిగా, సీఎంగా ఆయన పాత్ర ఎవరూ మరిచిపోలేనిది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. కొద్ది రోజులు ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్.. తర్వాత గాయం కారణంగా హాస్పిటల్.. అనంతరం హైదరాబాద్ ఇంట్లో రెస్ట్ లో ఉన్నారు. అయితే.. మూడు నెలల్లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అది కూడా మెదక్ స్థానం నుంచి.

ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు కీలకం కాగా.. ఎక్కువ సీట్లు సాధిస్తేనే క్యాడర్, నేతలు ఇతర పార్టీలకు జంప్ కాకుండా ఉంటారు. ఒకవేళ సత్తా చాటకుంటే జాతీయ పార్టీల ధాటికి తట్టుకోవడం కష్టమే. అందుకే, కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగుతునట్టు తెలుస్తోంది. మెదక్ స్థానం 2004 నుంచి బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉంది. అప్పట్లో ఆలే నరేంద్ర గెలిచారు. 2009లో విజయశాంతి, తర్వాత కేసీఆర్, కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 గెలిచింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో ఈ లోక్ సభ స్థానంలో కచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాతో కేసీఆర్ బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ కూడా మెదక్ స్థానం విషయంలో గట్టి పట్టుదలతో ఉంది. పార్టీ అగ్రనేత సోనియా గాంధీని ఈసారి తెలంగాణలో పోటీకి నిలపాలని మెదక్, మల్కాజ్ గిరి స్థానాలను ఆప్షన్ గా ఉంచింది రాష్ట్ర నాయకత్వం. సోనియా గాంధీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మెదక్ నుంచే పోటీ చేస్తారని ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కు అంతగా బలం లేదు. సిద్దిపేటలో బీఆర్ఎస్ కు వచ్చే భారీ మెజార్టీ పార్లమెంట్ ఎన్నికలపై ప్రతీసారి ప్రభావం చూపుతోంది.

మరోవైపు, సోనియా గాంధీ కాదంటే.. మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయశాంతి బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన సమయంలోనే ఈ మేరకు హామీ ఇచ్చారు హస్తం నేతలు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఎంపీగా గెలిచారు ఈమె. ఆ సమయంలో టీఆర్ఎస్ నుంచి కేసీఆర్, విజయశాంతి ఇద్దరే ఎంపీలుగా ఉన్నారు. తరువాత జరిగిన పరిణామాల్లో విజయశాంతి పార్టీలు మారారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ బరిలో ఉంటే.. కాంగ్రెస్ నుంచి విజయశాంతి ఢీ కొట్టే అవకాశం ఉంటుంది.

You may also like

Leave a Comment