Telugu News » Allu arjun: తన అభిమానిని చూసి చలించిపోయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!

Allu arjun: తన అభిమానిని చూసి చలించిపోయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!

హైదరాబాద్‌ విమానాశ్రయంలో చక్రాల కుర్చీలో ఉన్న అభిమానిని చూసిన బన్నీ.. ఆ చిన్నారి వద్దకు వెళ్లి సరదాగా కాసేపు మాట్లాడాడు. చిన్నారి పేరు, ఇతర వివరాలు అడిగి తెలుసుకుని ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడు.

by Mano

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Icon star allu arjun) పాన్ ఇండియా(pan india) సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇంతటి క్రేజ్ ఉన్నా బన్నీ ఎక్కడా తన ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేయడు. ఆటోగ్రాఫ్స్‌, సెల్ఫీల కోసం ఫ్యాన్స్‌ ఎగబడ్డా ఓపిగ్గా ఉంటూ ఫ్యాన్స్‌తో చాలా సరదాగా మాట్లాడి థాంక్యూ చెప్తుంటాడు. తాజాగా అల్లు అర్జున్‌(allu arjun) ఓ చిన్నారి అభిమానిని చూసి చలించిపోయాడు. అడిగిన వెంటనే ఆటోగ్రాఫ్‌ ఇచ్చేశాడు.

Allu arjun: Icon star Allu Arjun is shocked to see his fan!

జాతీయ అవార్డు అందుకునేందుకు బన్నీ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌ విమానాశ్రయంలో చక్రాల కుర్చీలో ఉన్న అభిమానిని చూసిన బన్నీ.. ఆ చిన్నారి వద్దకు వెళ్లి సరదాగా కాసేపు మాట్లాడాడు. చిన్నారి పేరు, ఇతర వివరాలు అడిగి తెలుసుకుని ఆటోగ్రాఫ్‌ ఇచ్చాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. కాగా, పుష్ప.. ది రైజ్‌ సినిమాలో తన అత్యుత్తమ నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు(National Award for Best Actor)ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించనున్నారు.

 

You may also like

Leave a Comment