చదువుకొని జీవితాలను ఉద్దరించుకొనే వయస్సులో విద్యార్థులు (Students) వీధి రౌడిల్లా మారుతున్నారు. కాలేజీకి (College) వెళ్ళి చదువుకోకుండా అనవసరమైన వివాదాల్లో తలదూర్చడం వంటి వార్తలు తరచుకుగా వింటూనే ఉన్నాం.. తాజాగా అంబేద్కర్ (Ambedkar) కోనసీమ (Konaseema) జిల్లా (District) అమలాపురం (Amalapuram)లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోంది.
పట్టణంలోని SKBR కాలేజీలో ఈ నెల 5న జరిగిన ఫేర్వెల్ పార్టీలో బీఏ, బీకామ్ విద్యార్థుల మధ్య పాట విషయంలో వివాదం చోటు చేసుకోంది. దీంతో విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి రోడ్డుపైనే కొట్లాటకు దిగారు. విద్యార్ధుల ఘర్షణ విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్రూపుల విద్యార్థుల్ని విచారిస్తున్నామని అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు.
కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విద్యార్థుల ఘర్షణకు సంబందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘర్షణపై కాలేజీ యాజమాన్యం కూడా స్పందించాల్సి ఉంది. అయిన తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల జీవితాలు బాగుపడాలని తపిస్తుంటే, బాధ్యతలు మరచిన కొందరు పోకిరీలు ఇలా గోడవలకు దిగి ఒక్కోసారి ప్రాణాలు పోగొట్టుకోవడం కనిపిస్తుంది. నిజంగా వ్యవస్థకు ఇలాంటి ఘటనలు మాయని మచ్చలే..