Telugu News » Cinnamon Helps : దాల్చిన చెక్క..వంటకే కాదు ఒంటికీ మంచిదే..!

Cinnamon Helps : దాల్చిన చెక్క..వంటకే కాదు ఒంటికీ మంచిదే..!

ఉపయోగాలలో దాల్చిన చెక్కది వేరే లెవెల్.! చూడడానికి సాదా సీదాగా కనిపించే ఈ దాల్చిన చెక్కలో దివ్యమైన ఔషద గుణాలున్నాయి.

by sai krishna

అది మషాల దినుసులకు పెద్దక్క.ఇది ఉంటే పోపుల పెట్టెకి ఓలెక్క.! లేకుంటే ఉస్సూరంటది కూరల…కక్కాముక్కా. అపుడపుడూ తగిలిస్తే తేలుస్తుంది రోగాల లెక్క.! వేరే చెప్పాలా వంటలక్కా..!? ఆ దినుసు పేరే దాల్చిన చెక్క..!లేటెందుకు దీని ఔషద గుణాలేంటో తెలుసుకుందాం ఎంచక్కా.!

ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి. ఇప్పుడంటే చిన్నా చితకా అనారోగ్యాలకు మందుల షాపల వెంట పరిగెడుతున్నాం గానీ..! ఒకప్పుడు వంటిల్లే మెడికల్ షాపు, పోపుల పెట్టే ఫార్మసి.

అందులో ఉన్నవన్నీ వంటకే కాదు..ఒంటికి కూడా బాగా పనిచేస్తాయి. అందులోనూ దాల్చిన చెక్కది వేరే లెవెల్.!చూడడానికి సాదా సీదాగా కనిపించే ఈ దాల్చిన చెక్కలో దివ్యమైన ఔషద గుణాలున్నాయి. ఒక సారి అవేంటో చూద్దాం.

ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్య డయాబెటీస్ (Diabetes).అసలు ఇది ఎందుకు వస్తుందంటే రక్తంలో చక్కెర కణాల్లోకి చేరకుండా రక్తంలోనే మిగిలిపోతుంది. అందువల్ల ఈ షుగర్ వ్యాధి వస్తుంది.

అయితే దాల్చిన చెక్కలో ప్రధానంగా ఫోర్ హైడ్రాక్సీ సినిమాల్డ్ హెయిడ్(Four Hydroxy Cinnamal Heide) , సినామిక్ యాసిడ్(Cinnamic acid) అనే కెమికల్స్ ఉంటాయి. ఇవి బీటా కణాలను యాక్టివేట్ చేసి..కణం లోపలికి చక్కెర వెళ్లేలా పనిచేస్తాయి.


అందుకే దాల్చిన చెక్క పొడిని తరచూ తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధిని కంట్రోల్ లో ఉంచవచ్చు. వయసు పెరగకుండానే మతిమరుపు పెరిగేవారికి దాల్చిన చెక్కతో మంచి వైద్యం చేయొచ్చు. మెదడు కణాల్లో వచ్చే ఇన్ ఫ్లమేషన్(Inflammation)వల్ల అవి వీక్ అయి ఆలోచనా శక్తి తగ్గడం, మతిమరుపు పెరగడం వంటివి చూస్తుంటాం.

దాల్చిన చెక్కలో ఉండే సిలోన్ సినిమాల్డ్ హెయిడ్ అనే కెమికల్ మెదడు కణజాలంలో వచ్చే హానికరమైన కెమికల్ ను చంపేస్తుందని అమెరికా సైంటిస్టులు చేసిన పరిశోధనలో తేలింది.ఫలితంగా మతిమరుపు తగ్గి మెదడు యాక్టివ్ గా పనిచేస్తుంది.

దాల్చిన చెక్కలో ఉండే సినిమాల్డ్ హెయిడ్, సినామిక్ యాసిడ్ లు శరీర రక్షణ వ్యవస్థను కాపాడుతాయి. ఇవి క్యాన్సర్ కణాలను వాటంతట అవే చనిపోయేలా ప్రేరేపిస్తాయి.

అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను, బ్లడ్ ప్రెషర్ ను తగ్గించడంలోనూ సినిమాల్డ్ హెయిడ్ కెమికల్ కీలక పాత్ర పోషిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాం చేసిన పరిశోధనలో తేలింది.

అప్పుడప్పుడు దాల్చిన చెక్కను తినడం వల్ల యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గా కూడా ఉపయోగపడుతుంది. చర్మసంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. రోజూ ఉదయాన్నే పరగడుపున దాల్చిన చెక్క పొడిని వేడినీటిలో కలుపుకుని తాగితే అధిక బరువు(Overweight)కు కూడా దాల్చిన చెక్కతో చెక్ పెట్టవచ్చు.

You may also like

Leave a Comment