అమెరికా (America)లో విషాదకరమైన ఘటన చోటు చేసుకొంది. ఓ నర్స్ చేసిన పని వల్ల సుమారు పది మంది వరకు అమాయక రోగులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. యూఎస్.. ఒరెగాన్ (Oregon)లో ఉన్న ఒక ఆసుపత్రిలో రోగులకు ఇచ్చిన మందులను ఓ నర్సు దొంగిలించింది.. వాటికి బదులుగా డ్రిప్ వాటర్ (Drip water) నింపినట్టు ఆరోపణలున్నాయి. ఈ కారణంగా 10 మంది రోగులు మృతి చెందినట్టు సమాచారం..
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.. ఈ క్రమంలో గత నెల ప్రారంభంలో ఒక మాజీ ఎంప్లాయిస్ మందులను దొంగిలించారని ఆసుపత్రి అధికారులు, పోలీసులను అలర్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే, పేషెంట్స్ కు ఇచ్చే పెయిన్ కీల్లర్ ఇంజెక్షన్ ఫెంటానిల్ దొంగతనం చేసి దాన్ని కప్పి పుచ్చేందుకు నర్సు, సదరు రోగులకు డ్రిప్ వాటర్ ని ఇంజెక్ట్ చేసిందని తేలింది. సదరు నర్సు నొప్పి మందుకి బదులుగా డ్రిప్ వాటర్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.. అయితే ఈ మరణాలు మెడిసిన్ చోరీ వల్ల జరిగిందా లేక ట్యాంపరింగ్ వల్ల జరిగిందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
మరోవైపు ఆసుపత్రిలో మరణించిన వ్యక్తుల మరణాలు ఇన్ఫెక్షన్ కారణంగా జరిగినట్టు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.. ఈ విషయాన్ని ఆస్పత్రి అధికారులు చెప్పినట్టు పేర్కొంటున్నారు. కాగా ఈ కేసుని మెడ్ఫోర్డ్లోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ ఘటనలో ఆసుపత్రి వైఫల్యం లేదని అధికారులు చెబుతున్నారు. చోరీ జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇన్ఫెక్షన్ కారణంగా మృతి చెందడానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు.