Telugu News » Amit Shah : అబద్ధాల్లో కేసీఆర్ దిట్ట.. 2జీ, 3జీ, 4జీ పార్టీలను తిరస్కరించాలి…!

Amit Shah : అబద్ధాల్లో కేసీఆర్ దిట్ట.. 2జీ, 3జీ, 4జీ పార్టీలను తిరస్కరించాలి…!

తెలంగాణ యువతను కేసీఆర్‌ మోసం చేశారని.. టీఎస్పీఎస్సీ లీకేజీలతో వారి జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. ప్రవల్లిక లాంటి ఎందరో ఆత్మహత్య చేసుకున్నారన్నారు.

by Ramu
amit shah fire on brs and congress in sakala janula sankalpa sabha

– మిషన్‌ భగీరథ కింద వేల కోట్లు తిన్నారు
– కాళేశ్వరం పేరుతో దండుకున్నారు
– అవినీతితో నిండిన కారును మోడీ సంక్షేమ గ్యారేజీలో పడేద్దాం
– కమీషన్ల కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చేద్దాం
– బీఆర్ఎస్, కాంగ్రెస్‌, మజ్లిస్‌.. 2జీ, 3జీ, 4జీ పార్టీలు
– 2జీ అంటే కేసీఆర్‌, కేటీఆర్‌
– 3జీ అంటే 3తరాల ఒవైసీ
– 4జీ అంటే నెహ్రూ, ఇందిరా, సోనియా, రాహుల్‌
– ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం
– బీఆర్ఎస్‌ కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయం ఆసన్నమైంది
– డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వల్లే అభివృద్ధి సాధ్యం
– గద్వాల, నల్గొండ, వరంగల్ లో అమిత్ షా ఎన్నికల ప్రచారం

బీఆర్ఎస్ అతి పెద్ద అవినీతి పార్టీ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆయన శనివారం గద్వాల, నల్గొండ, వరంగల్ లో పర్యటించారు. అబద్ధపు మాటలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. గులాబీ సర్కార్ బీసీలను మోసం చేసిందని.. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు బీసీ ద్రోహులని తీవ్రంగా ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి ఆ హామీని నెరవేర్చలేదన్నారు. చేనేత కోసం హ్యాండ్లూమ్ వీవర్స్ పార్కును నిర్మించలేదని మండిపడ్డారు.

amit shah fire on brs and congress in sakala janula sankalpa sabha

కృష్ణా నదిపై వంతెన హామీని మరచి పోయారని, 300 పడకల ఆస్పత్రిని నిర్మించలేదన్నారు. గుర్రం గడ్డ వంతెనను ఇప్పటికీ పూర్తి చేయలేదని.. బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైందని విమర్శించారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. బీజేపీకి అధికారం ఇస్తే రాష్ట్రంలో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు షా. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్ ను నిర్ణయిస్తాయని తెలిపారు.

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ బీసీ విరోధ పార్టీలని ఆరోపించారు. జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం మోడీ సర్కార్ రూ.70 కోట్లు కేటాయించిందని.. రూ.100 కోట్లు ఇస్తానని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పైగా, అవి ఇవ్వకపోగా మోడీ ఇచ్చిన డబ్బును కూడా ఖర్చు చేయలేదన్నారు. తెలంగాణ యువతను కేసీఆర్‌ మోసం చేశారని.. టీఎస్పీఎస్సీ లీకేజీలతో వారి జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. ప్రవల్లిక లాంటి ఎందరో ఆత్మహత్య చేసుకున్నారన్నారు.

బీజేపీకి అధికారం ఇస్తే ఐదేండ్లలో యువతకు 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. ఒవైసీకి బీఆర్ఎస్ లొంగిపోయి సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీలు.. 2జీ, 3జీ, 4జీ పార్టీలంటూ ఫైరయ్యారు.

2జీ అంటే కేసీఆర్‌, కేటీఆర్‌, 3జీ అంటే 3 తరాల ఒవైసీ, 4జీ పార్టీ అంటే నెహ్రూ, ఇందిరా, సోనియా, రాహుల్‌ అంటూ సెటైర్లు వేశారు. ఓటు బ్యాంకు కోసం ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లను బీఆర్ఎస్ కల్పించిందని.. ఈ పార్టీని ప్రజలు తిరస్కరించాలన్నారు. ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని.. వాటిని రద్దు చేసి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. భద్రాచలం కళ్యాణానికి ఆనవాయితీ ప్రకారం సీఎం ముత్యాల తలంబ్రాలు సమర్పించలేదని.. ఒవైసీకి తలొగ్గి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక, బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత అయోధ్య దర్శనం చేయిస్తామన్నారు అమిత్ షా.

You may also like

Leave a Comment