కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi) పై అసోం సీఎం హిమంత్ బిస్వ శర్మ (Himantha Biswa Sharma) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రాహుల్ గాంధీ మొదట వారసత్వ రాజకీయాలు అంటే ఏంటో తెలుసుకోవాలని ఆయన ఫైర్ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు బీజేపీలో లేరని తెలిపారు. జైషా ప్రస్తుతం బీసీసీఐలో వున్నారని తెలిపారు.
బహుశా బీసీసీఐ కూడా బీజేపీకి చెందిన ఒక శాఖ అని అనుకున్నట్టు వున్నారంటూ ఎద్దేవా చేశారు. పాపం నిరక్షరాస్యుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ కుటుంబం మొత్తం కాంగ్రెస్లో ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రతి దానిపై విమర్శలు చేస్తారని ఆయన అన్నారు. కానీ ప్రతి దానికి ఆయనే కారణమని రాహుల్ గాంధీ తెలుసుకోరని ఎద్దేవా చేశారు.
రాజ్ నాథ్ సింగ్ కుమారుడు యూపీలో ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పారు. రాజ్ నాథ్ సింగ్ కుమారున్ని ప్రియాంక గాంధీతో ఎలా పోలుస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని ప్రియాంక గాంధీ కంట్రోల్ చేస్తున్నారని వెల్లడించారు. మరి బీజేపీ మొత్తాన్ని రాజ్ నాథ్ సింగ్ కుమారుడు కంట్రోల్ చేస్తున్నాడో కాంగ్రెస్ పెద్దలే చెప్పాలన్నారు.
బీజేపీపై రాహుల్ గాంధీ మంగళ వారం తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు చేస్తోందన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మరి కేంద్ర హోం మంత్రి కుమారుడు, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కుమారుడు చేస్తున్నవేంటని ఆయన ప్రశ్నించారు. తాజాగా ఆ వ్యాఖ్యలపై అసోం సీఎం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.