బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అస్వస్థతకు గురయ్యారు. 81 ఏళ్ల వయస్సులో యువ హీరోలతో పోటీ పడుతూ తనదైన నటనతో అభిమానులను అలరిస్తున్న బిగ్ బీ, కరోనా తర్వాత తరచుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం కనిపిస్తోంది. అయితే తాజాగా మరోసారి ఈయన అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తుంది..

అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. వయసు పై బడటం తప్ప మరే ఇతర సమస్యలు లేవని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు అమితాబ్ కు పరీక్షలు చేసి త్వరగానే ఇంటికి పంపిస్తారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.. ఫ్యాన్స్ ఆందోళన పడవద్దని వెల్లడించారు.. ప్రస్తుతం 81 ఏళ్ల వయస్సు ఉన్న అమితాబ్.. గతంలో చాలాసార్లు జనరల్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారు..
అయితే 80ఏళ్లు పూర్తి చేసుకొన్న ఈ నటుడు.. ఇటీవల ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు ప్రీ వెడ్డింగ్ కి కూడా అటెండ్ అయ్యారు. కుటుంబ సభ్యులతో పార్టీకి అటెండ్ అయిన సమయంలో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది.. ఇంతలోనే ఇలా అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు..