ఏపీలో ఎన్నికల వేడి వేసవిని మరిపించేలా సాగుతుంది. ఇప్పటికే సభలు, సమావేశాలతో ఇక్కడ వాతావరణం యుద్ధరంగాన్ని మరిపిస్తుంది. మరోవైపు కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగా బీజేపీ కూడా బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. టీడీపీ (TDP), జనసేన (Janasena) పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపింది.

అదేవిధంగా బద్వేల్ నుంచి బొజ్జ రోషన్న.. జమ్మలమడుగు నుంచి సి. ఆదినారాయణ రెడ్డి.. ఆదోని, పీవీ పార్థసారథిని అధిష్టానం ఖరారు చేశారు. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ రంగంలోకి దిగనుంది. ఈ క్రమంలో బీజేపీకి పార్లమెంట్ 6 స్థానాలు, అసెంబ్లీకి 10 సీట్లు కేటాయించారు. మరోవైపు జనసేన పార్లమెంట్ -2, అసెంబ్లీ 22 స్థానాల నుంచి బరిలోకి దిగనుంది. ఇక మిగిలిన 143 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉండనున్నారు..