ఏపీలో పొలిటికల్ వార్.. రోజు రోజుకు హీట్ ఎక్కుతోంది. ఎన్నికల ప్రచారంలో కూటమి.. వైసీపీ మధ్య మాటల యుద్ధం పిక్ స్టేజీకి చేరుకొని వార్నింగ్ లు ఇచ్చుకొనే వరకి వెళ్తుందని ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితులు చూస్తే తెలుస్తోంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా గణపవరం (Ganapavaram) మండలం ఉంగుటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన అధినేత, వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
జగన్ (Jagan) మళ్లీ గెలిస్తే దేవుడు భూములను కూడా వదిలిపెట్టరని.. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ యదేచ్ఛగా కబ్జాలు చేస్తారని ఆరోపణలు చేశారు.. వైసీపీ (YCP) నాయకులు, కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్.. కూటమికి ఓట్లు వేస్తే వేళ్లు తీసేస్తామని వైసీపీ నాయకులు ఓటర్లను బెదిరించినట్లు తన దృష్టి వచ్చిందని తెలిపారు. అలాంటి వారికి తాను వ్యక్తిగతంగా వార్నింగ్ ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఆ పార్టీ నాయకులను వైసీపీ అధికారంలోకి రాకముందే తరిమితరమి కొట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కూటమి అభ్యర్థులు ఓట్లు వేస్తే వేళ్లు తీసేస్తారా?. కొట్టండని వీపు చూపిస్తామనుకుంటున్నారా?. మీరేమన్న పై నుంచి దిగొచ్చారా?, జనసైనికులను బెదిరించే దమ్ముందా. అని మండిపడ్డ పవన్.. ఓటర్లను మళ్లీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు బెదిరిస్తే సహించేది లేదని పేర్కొన్నారు..
ఈ ఎన్నికల తర్వాత అధికారం తమదే అని తెలిపిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఒక్కొక్కరి తాట తీసి ఉంగుటూరు రోడ్లపై మోకాళ్ల మీద నడిపిస్తామని సీరియస్ గా హెచ్చరించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు జనసేన నాయకులు, కార్యకర్తలు భయపడరని తెలిపారు.. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్లు ఓట్లు వేస్తారన్న ఆయన.. రాజ్యంగాన్ని గౌరవించలేని వారికి అధికారంలో ఉండే అర్హత లేదని వెల్లడించారు..