అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి
సీఐడీ (CID) తనను కూడా అరెస్ట్ చేయబోతోందని మాజీ మంత్రి నారాయణ (Narayana) కి తెలుసు. విచారణకు సహకరించకూడదని మాట్లాడుకునేందుకే జైలులో చంద్రబాబు (Chandrababu) ను కలిశారు. స్టూడెంట్స్, తల్లిదండ్రుల రక్తం పీల్చుకునే దుర్మార్గుడు నారాయణ. 800 కోట్ల విలువ చేసే పేదల భూములను కొట్టేసిన నువ్వు సత్య హరిచంద్రుడివా..? నారాయణ, చంద్రబాబు చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు.
టీడీపీ (TDP) నేతలు గంటలు కొట్టడం దేవుడి స్క్రిప్ట్. ముద్రగడ (Mudragada) కి చేసిన అన్యాయం గుర్తుకు వచ్చింది. నవ్వుతూ నిరసనలు తెలపడం, గంటలు కొట్టడం అదొక ఆందోళన అంటారా..? అందరూ నవ్వుతూ చేస్తున్నారు. బాధ అస్సలు కనిపించడం లేదు. చంద్రబాబు చేసిన ద్రోహం టీడీపీ నేతలకు కూడా కనిపిస్తుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే మనస్ఫూర్తిగా బాధపడుతూ ఉన్నారు.
ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులను చిత్ర హింసలు పెట్టి.. ఇబ్బందులు పెట్టిన విషయం టీడీపీ నేతలకు గుర్తు లేదా? లోకేష్ ఒక పులికేశి. ఢిల్లీలో లాయర్స్ తో మాట్లాడుతూ ఉన్నాడని టీడీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారు. సీఐడీ అధికారులకు దొరక్కుండా లోకేష్ దొంగలాగా తప్పించుకుని తిరుగుతున్నారు. సీఐడీ అధికారులు పట్టుకుని నోటీసులు ఇచ్చారు.