దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్(Election Code) నడుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పోలింగ్ సైతం పూర్తయ్యింది. విడతల వారీగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మాత్రం తుపాకుల మోత(GUN Fire) మోగుతూనే ఉంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇటీవల జరిగిన వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే.
వరుసగా జరిగిన ఎన్ కౌంటర్స్‌లో సుమారు వందకు పైగా మావోయిస్టులు(Maoists) మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మరోసారి కాల్పులు(Encounter) చోటుచేసుకున్నాయి. జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక జవాన్ మరణించినట్లు తెలిసింది.
దంతెవాడ జిల్లా బార్సూర్ పరిధిలోని హందవాడ, హితవాడలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు (DRG) పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసుల కదలికలను ముందుగానే గుర్తించిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో దంతెవాడ డీఆర్జీ కానిస్టేబుల్ జోగరాజ్ కర్మ మృతి చెందగా.. మరో కానిస్టేబుల్ పరశురామ్‌కు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కాగా, ఎదురు కాల్పలు చోటుచేసుకున్న ప్రాంతంలో పోలిసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.