ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం (Govt jobs Notification) ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీయువకులకు తెలంగాణ ప్రభుతం (Telangana Government) మరోసారి శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ఇప్పటికే ఖాళీలు ఏర్పడిన పోలీసు, వైద్య, ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైనా పలు న్యాయపరమైన, ప్రభుత్వం తప్పిదాలు, పేపర్ లీకేజీల కారణంగా ఉద్యోగ నియామక ప్రక్రియ చాలా ఆలస్యమైంది.
ఇటీవల రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..త్వరితగతిన పోలీస్,స్టాఫ్ నర్స్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీలను పూర్తి చేయడంతో పాటు ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆఫర్ లెటర్స్ కూడా అందజేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం వేదిక పోలీస్, స్టాఫ్ నర్స్, టీజీటీ,ఎస్జీటీ టీచర్ల అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
ప్రస్తుతం గ్రూప్స్-1,గ్రూప్-2, గ్రూప్-4, డీఎస్సీకి సంబంధించిన నియామకాలపై కసరత్తు జరుగుతోంది.డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం మరోసారి టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
తాజాగా వైద్య, ఆరోగ్యశాఖలో పెండింగ్లో ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు ప్రభుత్వం సూచన ప్రాయంగా తెలిపింది. అయితే, ఇన్చార్జి డీఎంఈగా వాణిదేవి నియామకంపై హైకోర్టు స్పందిస్తూ.. పూర్తి స్థాయి డీఎంఈని ప్రక్రియ పూర్తయ్యాక నియామకాలు చేపట్టాలని స్పష్టంచేసింది. దీంతో త్వరలోనే డీఎంఈతో పాటు డీపీఏ, డీసీహెచ్, కమిషనర్, టీవీపీసీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
కాగా, డీఎంఈ కేటగిరీలో డాక్టర్ రమేశ్ రెడ్డి గత ప్రభుత్వం నియమించగా పలువురు కోర్టును ఆశ్రయించారు.దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పూర్తి స్థాయి డీఎంఈని నియమించాలని తేల్చిచెప్పింది. అందుకోసం ఫిబ్రవరి 6న డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.