Telugu News » AP Politics: అమరావతిని శ్మశానంగా మార్చారు.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు..!

AP Politics: అమరావతిని శ్మశానంగా మార్చారు.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు..!

జగన్‌(AP CM YS Jagan)పై మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు(Ganta Srinivasa Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని శ్మశానంగా మార్చారని ఆరోపించారు. ‘భీమిలి సిద్ధం సభ’లో జగన్ అన్నీ అబద్ధాలే మాట్లాడారని మండిపడ్డారు.

by Mano
AP Politics: Amaravati has been turned into a cremation ground.. Ex-minister's key comments..!

ఏపీ రాజకీయం హీట్ ఎక్కింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి జగన్ హ్యాండ్ ఇస్తుండడంతో ఒక్కొక్కరిగా పార్టీ నుంచి బయటికెళ్తున్నారు. అంతేకాదు.. కొందరు అదే అదనుగా సీఎం జగన్‌పై, వైసీపీ పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది చూసిన ప్రజలు ఇన్నాళ్లు సీఎం జగన్‌ను పొగిడిన నేతలే ఇప్పుడు విమర్శలు చేస్తుండడంతో ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్‌(AP CM YS Jagan)పై మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు(Ganta Srinivasa Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP Politics: Amaravati has been turned into a cremation ground.. Ex-minister's key comments..!

అమరావతిని శ్మశానంగా మార్చారని ఆరోపించారు. ‘భీమిలి సిద్ధం సభ’లో జగన్ అన్నీ అబద్ధాలే మాట్లాడారని మండిపడ్డారు. జగన్ తనకు తాను అర్జునుడిగా చెప్పుకుంటున్నారని.. ఆ వ్యాఖ్యలపై జనం నవ్వుకుంటున్నారని గంటా శ్రీనివాస రావు ఎద్దేవా చేశారు. వైసీపీకి ఓటమి తప్పదని, 100 అడుగులు పాతాళంలోకి వైసీపీని పాతి పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ ధ్వజమెత్తారు. ఆ పార్టీ మునిగిపోతున్న నావ అని చెప్పారు.

అందుకే ఆ పార్టీని ఎమ్మెల్యేలు, ఎంపీలు వీడుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదన్నారు. ’వై నాట్ 175‘ అని సీఎం జగన్ అంటున్నారు.. పులివెందులలో ఆయన ఓడిపోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. గత ఎన్నికల సమయంలో జగన్ నవ రత్నాలతో కలిపి 730 హామీలు ఇచ్చారని తెలపారు. అయితే అందులో 15 శాతం హామీలే అమలు చేశారని అన్నారు. ’జగన్ ఎప్పుడూ తాము పాండువులం అంటారు. నిజానికి వారు కౌరవులు‘ అని సెటైర్లు వేశారు.

ప్రజా వేదిక కూల్చి పాలన ప్రారంభించారని అన్నారు. ఆయన పాలన అంతా విధ్వంసం, ప్రత్యర్థులు అణిచివేత కోసం కొనసాగాయని అన్నారు. 2019 ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన చెల్లి, తల్లిని బయటకు పంపేశారని గంటా విమర్శించారు. ఎన్నికల ముందు కోడి కత్తి డ్రామా ఆడారని అన్నారు. షర్మిల ఆరోపణలపై వైసీపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వైసీపీ అంటే నకిలీ పార్టీ, ముగ్గురు రెడ్లు నడుపుతున్నారని ఆరోపించారు. దేశంలో రిచెస్ట్ సీఎం జగనే అని, పేదల పక్షాన ఉన్నానని అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని సెటైర్లు వేశారు.

విలువలు పాటించకుండా తన రాజీనామా ఆమోదించారని.. కరణం ధర్మ శ్రీ రాజీనామాను ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీకి తెలిసే కోల్డ్ స్టోరేజ్‌‌లో ఉన్న రాజీనామాను ఆమోదించారంటూ విమర్శించారు. అదేవిధంగా విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానని చెప్పారని.. న్యాయ రాజధాని సంగతి ఎంత వరకు వచ్చిందని గంటా ప్రశ్నించారు.

You may also like

Leave a Comment