ఏపీ (AP)లో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే చలి కాలం.. దానికితోడు వర్షాలు పడటం వల్ల సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నట్టు వైద్యులు వెల్లడిస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలకు వరి పైరు కోసి.. నూర్చి ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవుతుంది. కొన్ని చోట్ల తడిసిన ధాన్యం కుప్పలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
అకాల వర్షాలు (Rains) పత్తి రైతులను (Cotton farmers) కూడా బాదిస్తున్నాయి. ఈ వర్షంతో దక్షిణ కోస్తా జిల్లాల్లోని పత్తి పొలాల్లో తీయాల్సిన పత్తి కూడా స్వల్పంగా తడిసింది. ఇతర పంటలకు ఉపయోగపడుతున్న వర్షాలు.. వరి, పత్తి రైతులకు నష్టం చేస్తుందని రైతు ఆవేదన చెందుతున్నాడు.. ఇక గతవారం బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడినా.. రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపలేదు.. దీంతో వరి, పత్తి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కాని ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇబ్బందులు పడుతున్నాడు..
మరోవైపు బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సమీపంలో నవంబర్ 27న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ కేంద్రం (weather station) వెల్లడించింది. ఆ అల్పపీడనం 29 నాటికి వాయుగుండంగా బలపడుతుందని.. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాలోలో ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. నేడు అల్లూరి సీతారామరాజు, బాపట్ల, అన్నమయ్య, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది..