Telugu News » AQI : యూపీలో పెరుగుతున్న వాయు కాలుష్యం…. నోయిడాలో 204 దాటిన ఏక్యూఐ….!

AQI : యూపీలో పెరుగుతున్న వాయు కాలుష్యం…. నోయిడాలో 204 దాటిన ఏక్యూఐ….!

ముఖ్యంగా నోయిడా, ఘజియాబాద్‌ నగరాల్లో వాయు నాణ్యత చాలా దారుణంగా పడిపోయింది.

by Ramu

యూపీ (UP ) లో వాయు కాలుష్యం (Air Quality Index) పెరిగి పోయింది. రాష్ట్రంలోని పలు నగరాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా నోయిడా, ఘజియాబాద్‌ నగరాల్లో వాయు నాణ్యత చాలా దారుణంగా పడిపోయింది. ఆయా నగరాల్లో ఈ రోజు వాయు నాణ్యత మరింత తగ్గినట్టు అధికారులు తెలిపారు. నగరాల చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది

నోయిడాలో వాయు నాణ్యత సూచీ 204గా నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. గాలి నాణ్యత పేలవమైన స్థితిలో ఉండటంపై అధికారుల్లో ఆందోళన మొదలైంది. జాతీయ వాయు నాణ్యతా సూచి ప్రకారం…. రాష్ట్రంలోని ఘజియా బాద్ జిల్లా లోనిలో వాయు నాణ్యత సూచి తగ్గిపోయిందని అధికారులు తెలిపారు. ఘజియా బాద్ లో వాయు నాణ్యత సూచీ 235 గా ఉన్నట్టు చెప్పారు.

ఇక్కడ వాయు నాణ్యత అంత్యంత పేలవమైన స్థాయిలో వుందని అధికారులు తెలిపారు. ఇక ఆగ్రాలోని సంజయ్ ప్యాలెస్ సమీపంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 125 గా ఉంది. బరేలీలో వాయు నాణ్యత సూచీ 136గా నమోదైంది. అటు బులంద్ షహర్ ప్రాంతంలో వాయు నాణ్యత సూచీ 146 మధ్యస్థంగా ఉంది. ఇక హాపూర్ ప్రాంతంలో ఏక్యూఐ 148గా నమోదైంది.

ఝాన్సీలో గాలి నాణ్యత సూచిక 107 మితమైన స్థాయలో వుంది. కాన్పూర్‌లోని నెహ్రూ నగర్‌లో 170 గాలి నాణ్యత మితమైన కేటగిరీలో వున్నట్టు అధికారులు పేర్కొన్నారు. మీరట్‌లో ఏక్యూఐ 163గా ప్రయాగ్‌రాజ్‌లో 167 ఉందని చెప్పారు.

You may also like

Leave a Comment