సిటీలు, పల్లెటూళ్లు అని కాదు ఈ మధ్య చాలా మంది ఫుడ్ యాప్స్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. అలసి పోయి ఇంటికి వచ్చినా, లేట్ నైట్ ఇంటికి చేరుకున్నా ఆకలి తీర్చే ఆపన్న హస్తాలు ఫుడ్ యాప్ లే..!
ఫ్రెష్ అప్ అయ్యే లోపు ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఇంటికి వచ్చి వాలుతుంది. ప్రస్తుతం అవకాశం ఉన్నా లేకున్నా అలవాటుగా ఫుడ యాప్ తలుపు తడుతున్నారు. వీకెండ్స్ లో హోటళ్లకు, రెస్టారెంట్లకు పరుగులు తీస్తన్నారు.
పొరుగింటి పుల్లకూర ఎలాగూ రుచే, హోటల్,రెస్టారెంట్ ఫుడ్స్ కూడా మనం ఇష్టంగా తింటుంటాం. అయితే వీటిని రకరకాల ఎట్రాక్టీవ్ ప్యాక్స్ చేస్తున్నాయి ఆయా ఫుడ్ బిజినెస్ సంస్థలు.
ఈ మధ్య బ్లాక్సెస్ లో కూడా ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వచ్చిన ఆహారంతో సమస్య కాదు, ఆ బ్యాక్సుతోనే అసలు ఆహరంతోనే చిక్కంతా అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బ్లాక్ బాక్సెస్ తో చాలా ప్రాబ్లమ్స్ పొంచి ఉన్నాయి.
ఎందుకంటే బ్లాక్ ప్లాస్టిక్‌ని రీసైకిల్కింగ్ కావడం కష్టమట. ప్లాస్టిక్ రెసిన్లకు కార్బన్ బ్లాక్ పిగ్మెంట్ జోడించడం ద్వారా దీనిని తయారు చేస్తారు. ప్లాస్టిక్‌కు నలుపు రంగు వచ్చేలా పిగ్మెంట్ పనిచేస్తుంది. రీసైక్లింగ్ కాకపోతే ఇవి ప్రకృతికి హాని చేస్తాయి. వీటిని కాల్చడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య(Plastic waste)తో పాటు, పర్యావరణ కాలుష్యం కూడా పెరిగే అవకాశం ఉంది.
పరిశోధన ప్రకారం, కార్బన్ బ్లాక్ పిగ్మెంట్(Carbon black pigment) కారణంగా బ్లాక్ ప్లాస్టిక్ ఆరోగ్యానికి చాలా హానికరం. కార్బన్ బ్లాక్ ప్లాస్టిక్‌లో PAH అంటే పాలీసైక్లిక్ హైడ్రోకార్బన్(A polycyclic hydrocarbon) ఉంటుందట. దీనిని క్యాన్సర్ కారకాలుగా ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ (IARC) పరిగణిస్తుంది.
అంతేకాదు శ్వాసకోశ సమస్యలు(Respiratory problems) కూడా రావచ్చు. మీరు ఇప్పుడు ప్లాస్టిక్ బ్లాక్ బాక్స్ లో ఆహారాన్ని తినడం ఆపాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ బాక్స్ లో అనేక రకాల హానికరమైన రసాయనాలు ఉంటాయి.బ్లాక్ బాక్స్ లో చాలా హానికరమైన రసాయనాలు కనిపిస్తాయి.
ఈ ప్లాస్టిక్ బాక్సులలో బిస్ ఫినాల్-ఎ(Bisphenol-A), థాలేట్స్(phthalates )వంటి కొన్ని రసాయనాలు ఉన్నాయని…అవి అందులో ప్యాక్ చేసిన ఆహారంతో కలిసిపోతాయని అనేక అధ్యయనాలలో పేర్కొన్నారు. ఆహారం చాలా వేడిగా ఉంటే…ఈ రసాయనాలు ఆ ఆహారంలో వెంటనే కరిగిపోతాయి.ఈ ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయి.