Telugu News » Argentina: 70వేల మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు..!

Argentina: 70వేల మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు..!

కొంతకాలంగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు సర్వసాధారణంగా మారిపోయింది. లేఆఫ్ పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అర్జెంటీనా (Argentina) అధ్యక్షుడు జావియెర్ మిలీ (Javier Milei) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

by Mano
Argentina: Attack on 70 thousand government employees..!

కొంతకాలంగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు సర్వసాధారణంగా మారిపోయింది. లేఆఫ్ పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకూ లేఆఫ్ భయం పట్టుకుంది. తాజాగా అర్జెంటీనా (Argentina) అధ్యక్షుడు జావియెర్ మిలీ (Javier Milei) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Argentina: Attack on 70 thousand government employees..!

అర్జెంటీనాలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఒప్పందం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో గతేడాదే వీరి కాంట్రాక్ట్‌ ముగిసినప్పటికీ ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. అయితే, వీరి కాంట్రాక్ట్‌ను రెన్యువల్‌ చేసే ఆలోచన తమకు లేదని అధ్యక్షుడు జావియెర్ మిలీ గతేడాది డిసెంబర్‌లోనే ప్రకటించారు.

రాబోయే రోజుల్లో 70వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని (Fire Government Workers) యోచిస్తున్నారని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక వెల్లడించింది. అర్జెంటీనాలో మొత్తం 35 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. అందులో తొలగించే ఉద్యోగుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వేల మందిని ఒకేసారి తీసేయాలని నిర్ణయించడమే ఆ దేశంలో ఇప్పుడు సంచలనమవుతోంది.

అధ్యక్షుడి నిర్ణయంపై కార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే కొన్ని సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం.. మరి కొద్ది నెలల్లో వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని జావియెర్‌ ఆలోచిస్తున్నారట. ఆర్థికంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదికలో పేర్కొంది. దీంతో కార్మిక వర్గం నుంచి వ్యతిరేకత మొదలైంది. ఇప్పటికే ఈనెల 26నుంచి ఓ కార్మిక వర్గం ఆందోళనలు చేపట్టింది.

You may also like

Leave a Comment