కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల ముందు బిగ్ షాక్ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) ఇద్దరు కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలు, నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ (BJP)లో చేరారు. ఇటానగర్, బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఖండూ సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ లు, ఎన్ సీపీ లీడర్లు ముచ్చు మితి, గోకర్ బాసర్ బీజేపీలో చేరారు.
ఈ నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో బీజేపీకి శాసనసభలో ప్రస్తుతం 53 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మరోవైపు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బయటి నుంచి మద్దతు ఇస్తున్నారు. కాగా 60 మంది సభ్యులున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పుడు కాంగ్రెస్, ఎన్‌పీపీలకు ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ ఏడాది లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి.
మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ చేరికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ (Modi) మద్దతుతో కూడిన సుపరిపాలన సూత్రాలపై నమ్మకం కలిగి.. కాంగ్రెస్, ఎన్పీసీ (NCP) నుంచి బీజేపీలోకి వస్తున్నారని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మోజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న హస్తంకు.. బీజేపీ మింగుడు పడకుండా తయారైందని భావిస్తున్నారు.
సరైన సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కాషాయం చేరికల విషయంలో వెనక్కు తగ్గేదే లేదనేలా ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా కొనసాగిస్తుంది. ఇదిలా ఉండగా.. తమిళనాడు (Tamilanadu)లో సైతం సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. విళవంగోడు నియోజకవర్గ మహిళా ఎమ్మెల్యే విజయతరణి (MLA Vijayatharani) బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు దేశీయ వినాయగం పిళ్లై ముదిమనవరాలైన ఆమె రాష్ట్ర కాంగ్రెస్ లో పలు కీలక బాధ్యతల్లో రాణించారు. కన్నియాకుమారి జిల్లా నుంచి కాంగ్రెస్ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.