ఎన్నికల నగారా దేశవ్యాప్తంగా మోగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule)ను నిన్న ఈసీ వెల్లడించింది. ఢిల్లీ (Delhi) విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajeev Kumar) ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏడు దశల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh), సిక్కిం (Sikkim) రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీలో స్వల్ప మార్పులు జరిగాయని.. ఈ రాష్ట్రాల్లో కౌంటింగ్ తేదీని జూన్ 4గా సీఈసీ (CEC) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తేదీలో కూడా స్వల్ప మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకొంది. జూన్ 4కు బదులుగా రెండు రోజులు ముందుగా అంటే 2వ తేదీనే కౌంటింగ్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు సిక్కిం రాష్ట్రాల్లో ఏప్రిల్ 19న ఓటింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల కౌంటింగ్ ప్రక్రియను తొలుత ప్రకటించిన తేదీ కంటే రెండు రోజులు ముందే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం అరుణాచల్ ప్రదేశ్‌లో 60 స్థానాలకు, సిక్కింలో 32 స్థానాలకు మొదటి దశలోనే ఎన్నికలు జరగనున్నాయని స్పష్టం చేసింది.