Telugu News » Congress : వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన బీఆర్ఎస్.. తెలిస్తే గుండె ఆగుతుంది..!!

Congress : వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన బీఆర్ఎస్.. తెలిస్తే గుండె ఆగుతుంది..!!

ఒకవైపు పబ్లిసిటీ (Publicity) కోసం భారీగా ఖర్చు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగే పరీక్షలలో బయోమెట్రిక్ విధానాన్ని వాడడానికి డబ్బులు లేవని కోర్టుకు చెప్పడం తప్పుపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మొత్తం పదేండ్ల కాలంలో ప్రచారం కోసం ఐ అండ్ పీఆర్ ద్వారా సుమారు రూ. 3,080 కోట్లను ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు తెరపైకి తీసుకు వస్తున్నారు..

by Venu
Congress High Command Focus On Unsatisfied Leaders And Election Campaign

రాష్ట్రంలో ఎన్నికలకు సమయం ఎక్కువగా లేని క్రమంలో బీఆర్ఎస్ (BRS)ను ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ (Congress) ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా తెలంగాణ (Telangana) ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకోవడానికే ఇతర రాష్ట్రాల పత్రికలకు యాడ్స్ ఇచ్చిందనే ఆరోపణలు హస్తం తెరపైకి తెస్తుంది. దశాబ్ది వేడుకల పేరుతో ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసిందని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఒకవైపు పబ్లిసిటీ (Publicity) కోసం భారీగా ఖర్చు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగే పరీక్షలలో బయోమెట్రిక్ విధానాన్ని వాడడానికి డబ్బులు లేవని కోర్టుకు చెప్పడం తప్పుపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మొత్తం పదేండ్ల కాలంలో ప్రచారం కోసం ఐ అండ్ పీఆర్ ద్వారా సుమారు రూ. 3,080 కోట్లను ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు తెరపైకి తీసుకు వస్తున్నారు.. సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా.. గడచిన తొమ్మిదిన్నరేళ్లలో సుమారు రూ. 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు లెక్కలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.

సంక్షేమానికి చిరునామా తెలంగాణ అంటూ గతేడాది ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ, ప్రాంతీయ పత్రికలకు కూడా భారీ స్థాయిలో యాడ్‌లను ఇచ్చి సొంత ప్రచారం చేసుకున్నట్టు కాంగ్రెస్ నేతలు వెల్లడిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు వచ్చిన రిప్లైతో పాటు బడ్జెట్ గణాంకాలను పరిశీలించిన తర్వాత.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మొదలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాల వరకు ఐ అండ్ పీఆర్ డిపార్టుమెంటు ద్వారా పబ్లిసిటీ కోసం దాదాపు రూ. 3,080.23 కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం వెచ్చించినట్లు తేలిందంటున్నారు కాంగ్రెస్ నేతలు..

మరోవైపు ముఖ్యమంత్రి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద ఏకంగా రూ. 10 వేల కోట్లను కేటాయించడం కూడా చర్చకు దారితీసింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను ఆకర్షించడానికి, ప్రసార మాధ్యమాలకు పబ్లిసిటీ రూపంలో భారీగా ఖర్చు చేయడానికి ఇంత భారీగా కేటాయించినట్లు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఓపెన్‌గా చెప్పారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రింట్, ఎలక్ట్రానిక్, ఔట్ డోర్ పబ్లిసిటీ కోసం ప్రభుత్వం ఎంతెంత ఖర్చు చేసిందో ఆర్టీఐ ద్వారా కాంగ్రెస్ పార్టీ సేకరించిన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం..

You may also like

Leave a Comment