Telugu News » KamaReddy : అదే జరిగితే రేవంత్ సీఎం అవ్వడం ఖాయం..??

KamaReddy : అదే జరిగితే రేవంత్ సీఎం అవ్వడం ఖాయం..??

రెండు దశాబ్దాలుగా కామారెడ్డిలో పట్టు జారిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్ ని ఒక్కసారిగా పెంచినట్టు అవుతుందని భావిస్తున్నారు. అందుకే దూకుడుకు మారు పేరు అయిన రేవంత్ రెడ్డిని.. కామారెడ్డి నుంచి బరిలోకి దించడానికి అధిష్టానం ఆసక్తి చూపించిందని టాక్.

by Venu
congress-leaders-are-criticizing-brs-leaders

తెలంగాణ (Telangana)లో ఎన్నికల పోరు కాంగ్రెస్, బీఆర్​ఎస్​ మధ్య ఉత్కంఠంగా సాగుతుంది. అయితే బీజేపీ (BJP) కూడా బీఆర్​ఎస్​కి గట్టిపోటీ ఇస్తుందని అంతా భావించారు.. కానీ అసెంబ్లీ ఎన్నికల పరుగుపందెంలో కమలం చతికిల పడుతుందని అనుకుంటున్నారు. వికసించినట్టే వికసించి వాడిపోయిన కమలాన్ని జనం పక్కనపెట్టినట్టే అని ప్రచారం జరుగుతుంది. అయితే బరిలో ఉన్న కాంగ్రెస్, బీఆర్​ఎస్​ పోరులో ముఖ్య ఘట్టం.. రేవంత్ రెడ్డి, కేసీఆర్ సై అంటే సై అంటూ పోటీచేస్తున్న కామారెడ్డి.. ప్రస్తుతం గజ్వేల్ నియోజక వర్గం కూడా రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ రెండు స్థానాల్లో బరిలో కేసీఆర్ ఉండటమే రాష్ట్రంలో చర్చకు దారితీసింది.

revanth-reddy

మరోవైపు కామారెడ్డి (Revanth Reddy)లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ అనూహ్యంగా జరిగిందని అంతా అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ (Congress) హై కమాండ్ ఒక ప్లాన్ ప్రకారమే రేవంత్ రెడ్డిని, కామారెడ్డికి పంపించిందని నేతలు భావిస్తున్నారు. కామారెడ్డిలో రేవంత్ ను బరిలో నిలపడం వల్ల కాంగ్రెస్ కు రెండు రాజకీయ లాభాలున్నట్టు ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ (KCR)ని ఓడించడం మొదటిది కాగా.. ఒక వేళ అది సాధ్యపడకపోయినా ఆయనకు గెలుపు అంత ఈజీ కాకుండా చేయడం రెండవ ప్లాన్ అనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది.

ఇలా చేయడం వల్ల రెండు దశాబ్దాలుగా కామారెడ్డిలో పట్టు జారిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్ ని ఒక్కసారిగా పెంచినట్టు అవుతుందని భావిస్తున్నారు. అందుకే దూకుడుకు మారు పేరు అయిన రేవంత్ రెడ్డిని.. కామారెడ్డి నుంచి బరిలోకి దించడానికి అధిష్టానం ఆసక్తి చూపించిందని టాక్.. ఇక టీడీపీ (TDP) పుట్టనంత వరకూ కామారెడ్డి కాంగ్రెస్ కి కంచుకోటగానే ఉంది. కానీ టీడీపీ పుట్టాక 1983 నుంచి 2018 దాకా జరిగిన తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కేవలం రెండు సార్లు మాత్రమే.. అది కూడా వరసగా కాదు.

అప్పటి నుంచి కామారెడ్డిలో కాంగ్రెస్ ఉనికి మాయం అయ్యింది. రెండు దశాబ్దాలుగా విజయం వరించక హస్తం అల్లాడిపోతుందని అనుకుంటున్నారు. మరోవైపు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక.. కామారెడ్డిలో బలంగా ఉన్న టీడీపీ ఓట్లన్ని బీఆర్​ఎస్ (BRS)కి షిఫ్ట్ అయ్యాయి. ఆ ధైర్యంతోనే కేసీఆర్ కామారెడ్డిని పోటీకి ఎంచుకున్నట్టు పొలిటికల్ సర్కిల్ టాక్.. మరోవైపు రేవంత్ రావడం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని ప్రచారం జరుగుతుంది.

అందువల్ల కామారెడ్డిలో కాంగ్రెస్ గెలిచేందుకు చాన్స్ ఉందని భావించిన అధిష్టానం కేసీఆర్ కి సరైన అభ్యర్థి రేవంత్ అని భావించినట్టు టాక్.. ఇక కాంగ్రెస్ ఊపు ఒక వైపు, రేవంత్ రెడ్డి దూకుడు మరో వైపు.. పైగా సీఎం క్యాండిడేట్ అన్న బ్రాండ్ కూడా ఉంది. అందువల్ల కామారెడ్డిలో కేసీఆర్ మీద గెలిచి కాంగ్రెస్ జాతకాన్ని మార్చితే సీఎం రేసులో ముందు వరసలో ఉండేది రేవంత్ రెడ్డి అనే టాక్ పొలిటికల్ వర్గాలలో గుప్పుమంటుంది. ఏది ఏమైనా ప్రస్తుతం గజ్వేల్ కంటే కూడా కామారెడ్డి పోటీనే ఇంట్రెస్టింగ్ గా ఉందంటున్నారు జనం..

You may also like

Leave a Comment