అసెంబ్లీ ఎన్నికల (Assembly Election) ప్రచారంలో భాగంగా భూపాలపల్లి (Bhupalpally)లో కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖకి (Konda Surekha) తృటిలో ప్రమాదం తప్పింది.
స్కూటీ నడుపుతూ కిందపడిపోయిన సురేఖ ముఖానికి, చేతికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే ఆమె అనుచరులు హుటా హుటిన హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సురేఖ చికిత్స పొందుతున్నారు. కాగా రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె ఈ ప్రమాదానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త కొండా మురళీ హుటాహటిన ఆసుపత్రికి చేరుకున్నారు.
మరోవైపు తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 55 మందితో ఈ జాబితాను ప్రకటించింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ టికెట్ ఆశిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో ఆమె పేరు లేదు. కనీసం రెండో జాబితాలో అయిన ఆమె పేరు ఉండే ఛాన్స్ ఉండవచ్చని కొండా అభిమానులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు.