అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో నేతలంతా పోటాపోటీగా బరిలోకి దిగడానికి సిద్దం అయ్యారు. కొన్ని చోట్ల అయితే కుటుంబ సభ్యుల మధ్య కూడా పోటీ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం రాజస్థాన్‌లో ఇలాంటి సిచ్యువేషన్ నెలకొంది. ఒక మహిళ ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తన భర్తపైనే పోటీకి దిగింది.
రాజస్థాన్ (Rajasthan), దంత రామ్‌గర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ (MLA Virendra Singh) ఎన్నికల పోటీలో దిగనుండగా, అతని భార్య రీటాచౌదరి కూడా జేజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.. ప్రస్తుతం దంత రామ్‌గర్ నియోజకవర్గంలో ఈ పోటీ ఆసక్తికరంగా మారింది. కాగా ఈ ఎన్నికల్లో విజయం తప్పకుండా తనని వరిస్తుందని రీటా చౌదరి ధీమా వ్యక్తం చేశారు.
అయితే రీటా చౌదరి 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దంతా రామ్‌గఢ్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి కాంగ్రెస్ టిక్కెట్‌ను కోరింది.. కానీ పార్టీ ఆమె భర్తను ఎంపిక చేసింది. ఇకపోతే రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.
మరోవైపు, అల్వార్ రామ్‌గర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే షఫియా జుబైర్‌కు అధికార కాంగ్రెస్ టికెట్ నిరాకరించి ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే జుబీర్ ఖాన్‌కు పార్టీ తరఫున అవకాశం కల్పించింది. దీనిపై షఫియా జుబైర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.