పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ(BJP) నాయకత్వం దూకుడు పెంచింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను మోడీ విజ్ఞప్తి చేశారు. ‘ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్.. అబ్ కి బార్ 400 పార్’ అనే నినాదంతో ముందుకు వెళ్తూనే..ప్రతిపక్ష కాంగ్రెస్ గతంలో చేసిన తప్పిదాలు, అవినీతిని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు.
అనంతరం ప్రధాని మోడీ అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకున్నారు. రామ్ లల్లా (Ram Lalla)ప్రాణప్రతిష్ఠ సమయంలో శ్రీరాముడు తనతో మాట్లాడినట్లు అనిపించిందని తెలిపారు.
‘అయోధ్య(Ayodhya)కు వెళ్లాక నన్ను నేను ప్రధానిక కాక సాధారణ పౌరుడిగానే భావించాను. అది చాలా భావోద్వేగ క్షణం. రాముడిని తొలిసారి చూడగానే అలా చూస్తూ ఉండిపోయా. పండితులు ఏం చెబుతున్నారో వినిపించలేదు. భారత్‌కు స్వర్ణయుగం మొదలైందని రాముడు చెప్పినట్లు అనిపించింది’ 140 కోట్ల మంది కలల్ని రాముడి కళ్లలో చూశాను’ అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
ఇదిలాఉండగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి రాబోతుందని ఇప్పటికే పలు సర్వేలు సైతం స్పష్టం చేశాయి. కాగా, 400 ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.కాగా, బీజేపీ అనుసరిస్తున్న విధానాలను ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.